Konda polam: ‘కొండ పొలం’ సినిమాలో ఇదే హైలైట్‌..!

Share

Konda polam: బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. తొలిచిత్రంలోనే నటనతో మెప్పించి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు తగ్గ మేనల్లుడనిపించుకున్నాడు వైష్ణవ్. ఇక రెండో చిత్రం టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్‌లో చేశాడు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రచించిన ‘కొండ పొలం’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని సక్సెస్ దిశగా ముందుకు సాగుతోంది.


Konda polam: కొండ‌పొలం చూసి వ‌ణుకుతున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌.. వీర‌మ‌ల్లుపై ఎఫెక్ట్‌..!
రవీంద్ర పాత్రకు న్యాయం చేసిన వైష్ణవ్..

రెండో చిత్రంలోనే అడ్వెంచరస్ రోల్ ప్లే చేశాడు వైష్ణవ్ తేజ్. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కొండ కోనల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. రవీంద్ర అనే పాత్రకు వైష్ణవ్ తేజ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడనే టాక్ ప్రేక్షకుల నుంచి వినబడుతోంది. ఓబులమ్మ పాత్రలో బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మెప్పించింది. ప్రేక్షకులను హీరో ద్వారానే కథలో ఇన్వాల్వ్ చేశాడు దర్శకుడు క్రిష్. ఎన్నో కష్టాలు దాటుకుని ఐఎఫ్ఎస్ అధికారి స్థాయికి హీరో పాత్ర ఎదిగిన తీరును అత్యద్భుతంగా తెరకెక్కించాడు క్రిష్. ఈ మూవీలో ఇదే హైలైట్ అని కొందరు సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. చక్కటి నటనతో హీరో, హీరోయిన్ ఇతరులు సినిమా స్థాయిని ఇంకా పెంచారని చెప్పొచ్చు.

Kondapolam Review: ‘కొండపొలం’ మూవీ రివ్యూ

భావోద్వేగాల సమ్మేళనం.. ‘కొండ పొలం’..

సాధారణంగా డైరెక్టర్ క్రిష్ చిత్రాలన్నీ కూడా డిఫరెంట్ జోనర్స్‌లో ఉంటాయి. ఇక ప్రేక్షకులు ఊహించినట్లుగానే ‘కొండ పొలం’ చిత్రంలోనూ అత్యద్భుతమైన భావోద్వేగాలున్నాయి. నటీనటులు కథ ప్రకారంగా తమ పాత్రలను చక్కగా పోషించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అత్యద్భుతంగా ఉంది. హీరో హీరోయిన్్స్ మాత్రమే కాదు.. సాయిచంద్, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, నాజర్, హేమ, రచ్చ రవి, మహేశ్, రవి ప్రకాశ్ తదితరులు సినిమాలో మంచి పాత్రలు పోషించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించిన ఈ చిత్రం డెఫినెట్‌గా బ్లాక్ బస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈ చిత్రాన్ని శుక్రవారం చూసిన మెగాస్టార్ చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. ఈ క్రమంలోనే నటీనటులను అభినందించారు.

Bigg Boss 5 Telugu: వారిని గట్టిగా టార్గెట్ చేసిన ఆ 11 మంది..??


Share

Related posts

ఆదిపురుష్ సినిమా విషయంలో ప్రభాస్ ఫాన్స్ హ్యాపీగా లేరు ?? కారణం ఇదే !

Varun G

Telangana : ఆ విషయంలో తెలంగాణ యువతను మోసం చేశారంటూ కేసిఆర్ పై నిప్పులు చెరిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..!!

sekhar

బీజేపీ గెలుపుకు వైస్సార్సీపీ వ్యూహం : తిరుపతి సాక్షిగా జరిగేది ఇదే!!

Comrade CHE