Tdp : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలలో విగ్రహాల ధ్వంసం ఘటనలో పోలీసులు చేస్తున్న విచారణలో బయటపడుతున్న వ్యక్తులు చాలా వరకు టిడిపి వాళ్లే.

ఈ విషయాన్ని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇటీవల స్పష్టం చేయడం జరిగింది. ఇదే క్రమంలో మరోపక్క ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మతాల మధ్య గొడవలు సృష్టించడానికి దేవాలయాల్లో ఉన్న హిందూ దేవుళ్ళ విగ్రహాలు త్వరలో కులాల మధ్య గొడవలు సృష్టించడానికి రెడీ అవుతున్నట్టు సరికొత్త బాంబు పేల్చిన వార్త ఇటీవల జగడం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో దళితుల అదేవిధంగా కాపుల మధ్య గొడవలు సృష్టించడానికి చంద్రబాబు వంగవీటి రంగ అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాలను గోదావరి జిల్లాలో పోగొట్టడానికి రెడీ అయినట్లు ఆరోపించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎన్ని గొడవలు సృష్టించడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావటానికి టిడిపి పన్నుతున్న కుట్ర అని వైసీపీకి చెందిన వాళ్లు అంటున్నారు. కావాలని గొడవలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలు సమస్య లేవనెత్తి..వాళ్లే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి ఫిర్యాదు చేయడం బాధాకరమని, టిడిపి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా బీజేపీ వాళ్లు నమ్మే స్థితిలో లేరని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్రం లో జగన్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉండటం చూసి చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు, అందువల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు సమస్య లేవనెత్తి ఏదో రీతిలో గొడవలు పెట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి టిడిపి అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తోందని ఈ క్రమంలో పోలీస్ వ్యవస్థ పై కూడా ఆరోపణలు చేస్తున్నట్లు వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏదిఏమైనా రాష్ట్రంలో ప్రజలు జరుగుతున్న దాడులు విగ్రహాల ధ్వంసం వెనకాల ఎవరు ఉన్నారో గమనిస్తున్నారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.