Ramdev Baba Vs IMA: బాబా రాందేవ్.. ఐఎంఏ మధ్య సాగుతున్న వార్ లో తాజా అప్డేట్ ఏంటంటే?

Share

Ramdev Baba Vs IMA: యోగా గురు బాబా రాందేవ్ ,అల్లోపతి వైద్యుల మధ్య జరుగుతున్న గొడవ గురువారం తారాస్థాయికి చేరింది.తమ మీద వరుస పెట్టి విమర్శలు ఆరోపణలు చేస్తున్న రామ్ దేవ్ మీద ఐఎంఏ వైద్యులు ఫైర్ అయ్యారు.ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి వారు ఆయనపై ఫిర్యాదు చేశారు.

This is the latest update on the ongoing war between Ramdev Baba and IMA
This is the latest update on the ongoing war between Ramdev Baba and IMA

దేశద్రోహం నేరం కింద పర్చడమే ఆయన శిక్షించాలని డిమాండ్ చేశారు.మరోవైపు ఢిల్లీలోని ఒక పోలీస్ స్టేషన్లో కూడా ఈ మేరకు వారో లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు.అయితే వీటన్నింటిని రామ్దేవ్ ఏమాత్రం ఖాతరు చేయకపోగా నన్ను అరెస్టు చేయాలంటే బాబులు దిగిరావాలంటూ వ్యాఖ్యానించటం మరో సెన్సేషన్.

Ramdev Baba Vs IMA: సీరియల్ మాదిరి కొనసాగుతున్న వివాదం

బాబా రామ్దేవ్ అల్లోపతి వైద్యుల మధ్య సాగుతున్న వివాదం ఒక ధారావాహిక సీరియల్ ను తలపింపజేస్తోంది. ఈ మధ్యే బాబా రాందేవ్ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో అల్లోపతి వైద్యాన్ని ఆ కేటగిరీ వైద్యులను ఆయన తీవ్రంగా విమర్శించారు.అల్లోపతి వైద్యం వల్లనే కరోనా రోగులు పెద్దసంఖ్యలో చనిపోతున్నారని ఆయన పేర్కొన్నారు.రెమడిసీవరు లాంటి ఇంజక్షన్లు సైతం కరోనా రోగుల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి అన్నారు.అల్లోపతి వైద్యం చేసే డాక్టర్ల మీద కూడా నోరు పారేసుకున్నారు. అంతకు ముందొక సందర్భంలో అల్లోపతి డాక్టర్లు ఆధునిక హంతకులని వ్యాఖ్యానించారు. దీనిపై ఐఎంఏ స్పందించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్కు ఫిర్యాదు చేశాక ఆయన దిగొచ్చినట్లు కనిపించారు .కేంద్రమంత్రి సూచన మేరకు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.కానీ పక్కరోజే మళ్లీ తన ధోరణి ప్రదర్శించారు. ఈసారి ఏకంగా అల్లోపతి వైద్యులకు ఇరవై అయిదు ప్రశ్నలు వేశారు.అల్లోపతి వైద్యం దేనికి పనికిరాదన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు.దీంతో మళ్లీ వివాదం రాజుకుంది.ఉత్తరాఖండ్ ఐఎంఏ శాఖ ఆయనపై వెయ్యికోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీస్ కూడా ఇచ్చింది.ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.

ప్రధానికి ,పోలీసులకు ఫిర్యాదు!

ఐఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయీష్ లిలే గురువారం నాడు ఐపీ ఎస్టేట్ పోలీస్స్టేషన్లో రామ్దేవ్ మీద దేశద్రోహం నేరం కింద ఫిర్యాదు చేశారు.కరోనా దేశంలో తీవ్రంగా వ్యాపించిన నేపథ్యంలో అల్లోపతి వైద్యం మీద, ఆ కేటగిరికి చెందిన వైద్యుల మీద ,కరోనాకు ఉపయోగించే ఇంగ్లీషు మందుల మీద రామ్ దేవ్ చేస్తున్న వ్యాఖ్యలు భారత దేశ పరువు ప్రతిష్టలను మంటగలిపే విధంగా ఉన్నాయని ఇది దేశద్రోహం నేరం కిందకు వస్తుందని ఆయన తన పధ్నాలుగు పేజీల ఫిర్యాదులో పేర్కొన్నారు.మరోవైపు ఇదే విషయాన్ని వివరిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కి కూడా ఐఎమ్ఏ లేఖ పంపింది.దేశ పరువు ప్రతిష్టలు కాపాడాల్సిన తరుణం ఇదేనని ఐఎంఏ తన లేఖలో మోడీకి విన్నవించింది.ఇప్పటికే రామ్ దేవ్ మీద జలంధర్ పోలీస్ స్టేషన్లో కూడా ఐఎంఏ చేసిన ఫిర్యాదు పెండింగ్ లో ఉంది.ఇంకా ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Read More: New Chandrababu: మహానాడులో ఈ వింత చూసారా..!? బాబోరి రంగు మార్చినట్టున్నారు..!?

బాబులు దిగివచ్చినా నన్ను అరెస్టు చేయలేరు

ఇదిలావుండగా ఐఎంఏ వైద్యులకు మద్దతుగా సోషల్ మీడియాలో అరెస్టు రామ్దేవ్ అన్న హ్యాష్ ట్యాగ్ తో ఉద్ధృత ప్రచారం మొదలైంది.దీనిపై రాందేవ్ తీవ్రంగా స్పందించాడు .ఆ డిమాండ్ చేస్తున్న వారి బాబులు దిగివచ్చినా నన్ను అరెస్టు చెయ్యలేరని యోగాగురు వ్యాఖ్యానించినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.బాబా రామ్దేవ్ కు అంత పవర్ ఏంటన్నదే అన్ని వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 


Share

Related posts

పనిమనిషిగా ఇంట్లో చేరింది .. కట్ చేస్తే సర్వ నాశనం చేసేసింది ! 

sekhar

అందరూ అనుమానించారు.. కాని ఆ హీరోయిన్ విషయంలో నాని చెప్పిందే జరుగుతోంది..!

GRK

మా జాబితా సిద్ధం

somaraju sharma