NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Police : పోలీసులకు చెమటలు పట్టిస్తున్న న్యూస్ ఇది..! శిరోముండనం బాధితుడు ఏమైనట్టు..!?

AP Police : సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం కేసులో మలుపులు చోటు చేసుకుంటున్నాయి.

This is the news that makes the ap police sweat ..!
This is the news that makes the ap police sweat ..!

శిరోముండనం బాధితుడు ఇండుగుమిల్లి వరప్రసాద్ అదృశ్యంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వరప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎవరో బెదిరిస్తున్నారంటూ ఫిబ్రవరి 3న వరప్రసాద్ ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు సీతానగర్ పోలీస్ స్టేషన్ లో ప్రసాద్ భార్య కౌసల్య ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు షాకింగ్ నిజం తెలిసింది. ప్రణాళిక ప్రకారమే వరప్రసాద్ కాకినాడలోని తన మిత్రుడు సందీప్ ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పైగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్లు దర్యాఫ్తులో వెల్లడైంది. తప్పుడు సమాచారంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు పోలీసులు సీరియస్ అయ్యారు. వరప్రసాద్ తో పాటు సందీప్ ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

AP Police : అప్పుడు జరిగిందేమిటంటే!

2020 జూలై 18న మునికూడలి, కటావరం దగ్గర ఇసుక రేవు వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రశ్నించిన వరప్రసాద్‌కు పోలీసు స్టేషన్‌లో ఎస్ఐ ఫిరోజ్ శిరోముండనం చేయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రపతి కార్యాలయం వరకు విషయం చేరడంతో కలకలం రేపింది. సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. తనకు శిరోముండనం చేయించిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ ఇదివరకు వరప్రసాద్ నిరసన దీక్ష కూడా చేపట్టాడు.

ఇంతలో ఇలా …పోలీసులు ఛేదించారు అలా!

కేసు పురోగతి సాధించకపోవడంతో వరప్రసాద్ మనస్తాపంతో ఉన్నాడు. తనకు న్యాయం జరగదని భావిస్తున్నాడు. శిరోముండనం గురించి వేధిస్తున్నారని చెప్పి వాపోయేవాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. బుధవారం(ఫిబ్రవరి 3,2021) సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఆచూకీ కనిపించకపోవడంతో.. కంగారుపడ్డ కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.అసలే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరిపారు .గాలింపు చేపట్టారు.చివరకు వరప్రసాద్ ని పట్టుకున్నారు.తనంతట తానే ఇల్లొదిలి వెళ్లి పోయి అదృశ్యమైన బిల్డప్పిచ్చిన వరప్రసాద్ వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.

 

author avatar
Yandamuri

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju