American groom: అమెరికా అల్లుళ్ళు అంటే మంచి క్రేజ్
పరిశోధకులు వెల్లడించిన ఒకసర్వే ఫలితాల లో తాజాగా బయట పడిన విషయం ఏమిటంటే.. ఆడపిల్లల తల్లిదండ్రులు అమెరికా అల్లుళ్లను వద్దనుకుంటున్నారట.ఇంతకు ముందుభారతదేశం లో అమెరికా అల్లుళ్ళు అంటే మంచి క్రేజ్ ఉండేది. తమ కూతురు ఎంతో సంతోషంగా విదేశాల్లో బ్రతకడం తో పాటు డబ్బులకు కూడా ఎలాంటి లోటు ఉండదు పైగా భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అని ఆడపిల్లల తల్లి తండ్రులు ఎక్కువగా అమెరికా, లండన్ వంటి పలు దేశాల్లో తమ పిల్లలను ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపించే వారు. అలాంటి పరిస్థితులనుండి ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది అంటున్నారు పరిశోధకులు.

American groom: ప్రాణాలకు కూడా ఎటువంటి భద్రతా
తాజాగా ముంబై కి చెందిన ఒక విశ్వవిద్యాలయంచేపట్టిన సర్వేలో ఇదే విషయం బయటపడింది. ఆడపిల్లల కుటుంబాల మీద పరిశోధకులు పలు కాలేజీల్లో సర్వేలు చేయగా.. ఈ సర్వేల్లో 57 శాతం మంది అసలు తమ అమ్మాయిని విదేశాల్లో ఇవ్వడానికి ఇష్టపడడం లేదట, అక్కడికి వెళ్లిన తర్వాత పని ఒత్తిడితో భర్తలు భార్యలకు నరకం చూపిస్తున్నారని, ఇక విదేశాలకు పంపడం వలన ప్రాణాలకు కూడా ఎటువంటి భద్రతా లేదని, ఇక్కడే ఉండి మంచి ఉద్యోగం చేస్తున్న లేదా ఆస్తి ఉన్న అబ్బాయి చాలు అని భావిస్తున్నారట.
ప్రభుత్వం ఉద్యోగం
ఇంకొంతమంది మంది అయితే తమకు బాగా తెలిసిన వాళ్ళు అయితే మాత్రమే అమెరికాలో జాబ్ చేస్తున్నవారికి ఇస్తామని లేకపోతే ఇవ్వమని నిక్కచ్చిగా చెప్పేసారట. మరికొందరు అయితే, అమెరికా లో చేసే ఉద్యోగం కంటే ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగమే మంచిది అని తెలియచేశారట… నాలుగు శాతం మంది ఆస్తి లేకపోయినా .. ప్రభుత్వం ఉద్యోగం ఉన్న చాలని, అబ్బాయి కి ఇతమైతే ఇల్లరికం కూడా తెచ్చుకుంటాం అంటున్నారట. ముఖ్యంగా విదేశాల్లో సంబంధాలు చేసుకోవడానికి మాత్రం మెజారిటీ తల్లి తండ్రులు అసలు ఒప్పుకోవడం లేదని సర్వే చేసిన నిపుణులు తెలియచేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?