ప్రభాస్ సలార్ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆవిష్కరించబోతున్నాడు. kgf చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ రెండు భాగాల కంటే మించిన స్థాయిలో దర్శక నిర్మాతలు prabhas salaar ని నిర్మించనున్నారు. ఇక ప్రభాస్ కెరీర్ లో ఇప్పటి వరకు రానటువంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో సలార్ రాబోతోంది.
అయితే prashanth neel salaar ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి కథ విషయంలో అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో 2014లో వచ్చిన ఉగ్రమ్ సినిమాకు రీమేక్ గా salaar ని ఇప్పుడు తెరకెక్కించబోతున్నాడన్న మాట పదే పదే వినిపిస్తోంది. అలా ప్రచారం అవడానికి కూడా బలమైన కారణం ఉంది. ugram సినిమాలో మాఫియా డాన్ ఉంటాడు. అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కథ. ఇప్పుడు prabhas salaar సినిమా కథ కూడా దాదాపు ఇలాంటిదే. ఇక prabhas ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ గా కనిపించబోతున్నాడనే విషయం టైటిల్, ప్రభాస్ లుక్ తో అర్తమైంది. అందుకే సలార్ సినిమా ఉగ్రమ్ కు రీమేక్ అని ప్రచారం జరుగుతోంది.
కాగా తాజాగా ఈ విషయంలో దర్శకుడు prashanth neel పక్కాగా క్లారిటీ ఇచ్చి రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టాడు. salaar కథ కంప్లీట్ గా కొత్త కథ అని ఇలాంటి కథ ఇండియన్ స్క్రీన్ మీదే రాలేదని అంటున్నాడు. అంతేకాదు ఈ కథ ప్రత్యేకించి ప్రభాస్ కోసమే రాశాడని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంటుందని ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు prashanth neel. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగబోతుండగా.. త్వరలోనే హీరోయిన్ ని ప్రకటించబోతున్నారట. ఇక ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ కూడా రీసెంట్ గా ప్రారంభం అయింది. ఒకవైపు రాధే శ్యాం రిలీజ్ కి రెడీ అవుతోంది.