Future: భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు చేయవలిసిన  పని ఇది ??

Share

Future: సమస్త ప్రాణ కోటికి నీరు ప్రాణాధారం అని మనకు తెలుసు .    భూమిపై మూడు వంతుల పాటు నీళ్లు,ఒక వంతు నేల    ఉన్నాయి.  అయినా కూడా  ఆ నీరు మనం తాగడానికి, అవసరాలకు పడుకోవడానికి పనికి రాదు. భూమిపై ఉన్న కొద్ది పాటి నీటిని మాత్రమే మన అవసరాలకు  ఉపయోగించుకోగలుగుతున్నాం. రోజురోజుకు జనాభా పెరుగుతూ పోతుండడంతో  నీటి  అవసరం కూడా పెరుగుతూ పోతుంది.  అందుకే మన అవసరాల కె కాదు భవిష్యత్ తరాలకు నీరు సరి పోవాలంటే నీటి వృథాను  నివారించవలసిన అవసరం ఉంది .  నీటిని వృధా  చేయకుండా , ఎలా పొదుపు  చేయాలో  తెలుసుకుందాం.

నీటిని పొదుపు  చేయడం అనేది చాలా తేలిక . మనం రోజూ చేసే పనిలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు.. నేను మాత్రం చేస్తే సరిపోతుంది అని మాత్రం అనుకోకండి.. మీ వంతు మీరు కృషి చేయండి.  దీనికి మనం ఇంట్లో బాత్రూం, కిచెన్.. మిగిలిన చోట్ల వాడే  నీటి  వాడకాన్ని  తగ్గించే ప్రయత్నం  చేస్తే చాలు.స్నానం చేయడానికి షవర్, బాత్ టబ్   ఉపయోగించి నీళ్ళు  వృధా  చేయకుండా  బకెట్లో  నీళ్లు నింపుకుని స్నానం చేయడం  వలన నీరు  ఎక్కువగా ఖర్చు కావు .చాలామంది  ముఖం పడుకునేటప్పుడు, షేవింగ్ చేసుకుంటున్నప్పుడు,  బ్రష్  చేస్తున్నప్పుడు మధ్యమధ్యలో నీళ్లు  అవసరం అవుతాయి అని ట్యాప్ తిప్పేసి  ఉంచుతారు. దీనివల్ల నీరు చాలా వృధా గా పోతుంటుంది.  కాబట్టి ట్యాప్ ఆఫ్ చేసి ,   అవసరం ఉన్నప్పుడు మాత్రమే ట్యాప్ తిప్పి నీటిని తీసుకోవడం వల్ల చాలా వరకు నీళ్లు ఆదా చేసుకోవచ్చు. ఇంట్లో అందరూ ఇలా చేయడం వల్ల  ఎక్కువ మొత్తంలో నీటిని పొదుపు చేయవచ్చు.

దీంతో పాటు అస్తమానము  కాళ్లు, చేతులు, ముఖం కడుక్కోవడానికి బదులుగా రోజుకు   రెండు లేదా మూడు సార్లు మాత్రమే చేయడం వల్ల నీటిని ఆదా చేసే వీలుంటుంది. అలాగే  అవసరాన్ని మించి ఫ్లష్  చేయకుండా చూసుకోవాలి. ఇలా చేయాలంటే ఫ్లష్ ట్యాంక్ లో కొంత భాగం  వరకు, ఏదైనా ప్లాస్టిక్ డబ్బాతో కవర్ చేయడం వలన  అందులో నీళ్లు తక్కువగా పట్టి ఫ్లష్ ఉపయోగించిన ప్రతిసారి తక్కువ నీళ్లు ఖర్చు అవుతాయి


Share

Related posts

YS Sharmila : పార్టీ ఏర్పాటుకి సిద్ధమవుతున్న షర్మిలకు భారీ షాక్ ఇచ్చిన కేసీఆర్..! హాట్ టాపిక్ ఇదే..!!

Yandamuri

వామ్మో.. శేఖర్ మాస్టర్ మామూలోడు కాదు.. సంగీతకు ఎలా లైన్ వేస్తున్నాడో చూడండి..!

Varun G

నిత్యం ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారా.. ఈ టిప్స్ గురించి తెలుసుకోండి

Teja