NewsOrbit
న్యూస్

అమరావతి ఉద్యమంలో ఇదో వెరైటీ !

మూడు రాజధానులు బిల్లు గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో మళ్లీ ఊపందుకున్న అమరావతి ఉద్యమం లో కొత్త కొత్త అధ్యాయాలు ఆవిష్కృతమవుతునాయి.ఇక అమరావతిని న్యాయస్థానాలే కాపాడగలవని రైతులు భావిస్తున్నారు.అమరావతి భవితవ్యం న్యాయస్థానం వద్దకు వచ్చింది.

this is the variety of amaravati movement
this is the variety of amaravati movement

హైకోర్టులో మంగళవారం సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై విచారణ చేపడుతున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు న్యాయమూర్తులకు దండం పెడుతూ వారు వెళ్లే మార్గంలో మానవహారంగా నిలుచున్నారు. వెంటకపాలెం, మందాడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయపాలెం గ్రామస్తులు కిలోమీటర్ల మేర నిలుచున్నారు. రోడ్డుపై నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు.

అందరికి అన్నం పెట్టిన ఆ చేతులు ఈ రోజు తమకు న్యాయం చేయమని వారిని అర్థిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్‌ను, రైతులను కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని మహిళా రైతులు అన్నారు.త్యాగాలు చేసిన రైతులను ప్రభుత్వం రోడ్డుపై నిలుచోబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలనే దేవస్థానాలుగా భావించి న్యాయమూర్తులను వేడుకుంటున్నామని రైతులు వ్యాఖ్యానించారు. కాగా సోమవార౦ తుళ్లూరు మహిళా రైతులు న్యాయస్థానానికి పూజలు చేసిన విషయం కూడా తెలిసిందే.ఏ ప్రభుత్వం కూడా ఆ 39 గ్రామాల ఆవేదన పంచుకునేందుకు ఇంతవరకూ ముందుకు రాలేదు.

225 రోజులు గా ఈ రైతన్నల ఘోష వినడానికి ఇంతవరకూ ఏ ప్రభుత్వానికి తీరిక లేదు. కనీసం న్యాయదేవత అన్నా తమ గోడు విని తమకు న్యాయం చేస్తుంది అని ఆశిస్తూ ఆ న్యాయమూర్తులకు అమరావతి రైతులు అభివాదాలు చేశారు.అయితే ఇది కూడా టిడిపి ప్లానే అని వైసీపీ అనుమానిస్తోంది.అమరావతి ఉద్యమం వెనుక టిడిపి ఉందన్నది జగమెరిగిన సత్యం.కాబట్టి అమరావతిలో ఏం జరిగినా అది టిడిపి ఖాతా లోకే వెళుతుంది. ఇది జరిగిన కొద్ది సేపటికే మంగళవారమే అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు స్టే ఇవడం కొసమెరుపు.

author avatar
Yandamuri

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N