soul: తల్లిదండ్రులను గౌరవించాలి.. పూజించాలి అస్సలు ఎట్టి స్థితిలో కూడా దూషించ కూడదు. ఒకవేళ ఏదైనా కారణానికి అలా జరిగితే మీ తప్పుకు ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసిన ప్రయోజం ఉండదు. భోజనం చేసేటప్పుడు తూర్పు, ఉత్తర దిక్కులవైపు ముఖం వచ్చేలా కూర్చొని చేయడం మంచిది.మలమూత్ర విసర్జన చేయడానికి ఉత్తర దక్షిణ దిశలుగా ఉండి మాత్రమే ఆ పని చేయాలి. తూర్పు వైపు , దక్షిణ వైపు కాకుండా ,ఉత్తర దిక్కు లో , లేదా పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే ( Sleep ) ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం తెలియచేస్తుంది.ఇతరుల బట్టలు,చెప్పులు తొడుక్కోకుండా ఉండడం మంచిది.
soul: చతుర్దశి తిథి , అష్టమి తిథులలో తలంటు స్నానం,స్త్రీ సంగమం వంటివి చేయకూడదు.
స్నానం చేయకుండా అన్నం వండకూడదు,ఆ అన్నం తినకూడదు. నోటితో అగ్నిని ఊది ఆర్పడం వంటివి చేయకూడదు.
పుణ్య కార్యాల్లో ఉన్నప్పుడు చోళ్ళ తో చేసినవి , జొన్నల తో చేసినవి , వెల్లుల్లి తో చేసినవి, ఉల్లి పాయ , చద్ది పదార్థాలు వంటివి తినకూడదు.. వీటిలో వాడకూడదు. ప్రయాణలు చేస్తున్నప్పుడు మధ్యలో భోజనాదులకు నియమంలేదు.అంటే స్నానం చేయలేదు దీపం పెట్టలేదు,ఉపవాసం ఇలాంటివి అన్నమాట.తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు దూలపడం అనేది దోషం గా చెప్పబడింది.
ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆత్మహత్య చేసుకోకూడదు.
అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మల పాటు.. పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుట్టి అంతకు ముందు ఏ బాధలైతే పడలేక ఆత్మ హత్య చేసుకున్నారో, ఆ బాధలు తిరిగి మళ్ళి అనుభవిస్తారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కర్మలను సుఖాలు,బాధలు రూపం లో అనుభవించడానికి మనకు ఈ శరీరం,అది అనుభవించకుండా బలవంతం గా మరణిస్తే ఆగిన చోటునుండే బాధలు మళ్ళి మొదలవుతాయి. ఒకే సారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకుని వెళ్ళకూడదు.