Wake Up: మనం రోజు  నిద్రలేవగానే రెండు అరచేతులు   రుద్దుకొని కళ్ళకు అద్దుకోవడం వలన జరిగేది ఇదే !!

Share

Wake Up: దైవకార్యాలరూపములో
టెక్నాలజీ ఇంతగా  అభివృద్ధి  చెందని  కాలములో ఋషులు , మును లు  ఎన్నో  అరోగ్య సూత్రాలను  ( Health Tips ) రూపొందించారు . వైద్య రంగము  పెద్దగా   అభివృద్ధి చెందని కాలములోనే   శుచి  , శుబ్రత , వ్యాధినిరోదకత  ఇవన్నీ దైవకార్యాలరూపములో  చేసేవిధం గా  దిశ నిర్దేశం చేసారు  .  పుణ్యం తో పాటు పురుషార్ధం  వస్తుందంటేనే  సామాన్యప్రజలు   వీటిని   అనుసరిస్తారు అనేది   ఇలా చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

Wake Up: సందర్శించినంత పుణ్యము

నిద్ర లేవగానే  అర చేతులు రుద్ది కళ్ళకు  పెట్టుకోమని  మన  ఋషులు   సూచించారు. ఇందులో  ఒక పెద్ద ఆరోగ్య సూత్రం  దాచి  వారు  ఈ విధం గా  చెప్పారు. అర చేతులు రుద్దుకుని  చూసేటప్పుడు..   బ్రహ్మ రాసిన చేతిగీతలు అనుకోకుండ  మనం చూడడం  జరుగుతుంది. ఇలా జరగడం వలన  బ్రహ్మను పూజించిన ఫలితం  కలిగి , బ్రహ్మజ్ఞానము  పొందుతాము అని ..     ఈ విధానంగా   ప్రతిరోజూ చేయడము వల్ల కోటి పుణ్యక్షేత్రాలు సందర్శించినంత పుణ్యము  వస్తుంది అని .. లక్ష్మి  ( lakshmi )అనుగ్రహం పొందుతారు  అని  పెద్దలు  తెలియచేసారు. అయితే  మన  పెద్దవారు ఇలా  చేస్తే  మంచిది  అలా చేయడం  మంచిది కాదు  అని చెప్పడం వెనుక ఆరోగ్యము , అనారోగ్యము  దాగి  ఉన్నాయి  అని తెలుసుకోవాలి.  ఎవరయినా అలా చెప్పినప్పుడు .. చాదస్తము  అని తీసిపారయేయకూడదు .  ఎందుకంటే  ఆ మాటల్లో   ఆరోగ్యము , ఉత్సాహము   దాగి ఉంటాయి.

 చేతుల్లో పుట్టిన వేడి

మనం రోజు  నిద్రలేవగానే రెండు అరచేతులు   రుద్దుకొని కళ్ళకు అద్దు అడ్డుకోవడం వలన   చేతుల్లో పుట్టిన వేడి    కళ్ళకు తగలడం వలన  కళ్ళ లో రక్త ప్రసరణ బాగా జరిగి  ఆరోగ్యవంతంగా, కాంతి  వంతం  గా  ఉండడం తో పాటు  నిద్ర  మత్తు వెంటన్నే వదిలిపోతుంది. ఇలా చేయడం వలన  కంటి  జబ్బులు  కూడా  రావు  . కళ్ళ అద్దాల అవసరము కూడా అంత  త్వరగా   ఉండదు . ఇది  మన  పెద్దలు చెప్పిన మాటమాత్రమే  కాదు  వైద్యశాస్త్రము   సూచించిన ఆరోగ్యసూత్రము  కూడా .


Share

Related posts

Anger: స్త్రీ, పురుషుల లో వీరికే ఎక్కువగా  కోపమొస్తుందట!!

Kumar

జైల్లో సహాయకుడు- నవాజ్ వినతికి పాక్ నో

Siva Prasad

చీరాల దళిత యువకుడి మృతి కేసులో ఎంటరైన మాజీ ఎంపి హర్షకుమార్..!సిబిఐ దర్యాప్తునకు డిమాండ్..!హైకోర్టులో పిల్ దాఖలు

Special Bureau