Architectural: ఇంటా, బయటా ఎక్కడికి వెళ్లిన ఒకదాని వెంట మరొకటి సమస్యలు వస్తూనే ఉంటాయి. చిన్న పనిలో కూడా ఏదో ఒక ఇబ్బంది వస్తుంటుంది. ఆర్థికంగా, శారీరకం గా,మానసికంగా ,అన్నీ ఒకేసారి చుట్టుముట్టేస్తుంటాయి.. అని బాధ పడుతున్నారా ? ఇది ఇంట్లోఉన్న వాస్తు దోషం, నెగెటివ్ ఎనర్జీ, కూడా అయి ఉండవచ్చు. నెగెటివ్ ఎనర్జీ తో వాస్తు దోషం కూడా చేరితే అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారికి అన్నీ సమస్యలాగానే మారుతాయి అని నిపుణులు అంటున్నారు . నివారణా మార్గాలు ఏమిటో తెలుసుకుందాం.
Architectural: వాస్తు దోషం పోగొట్టేందుకు నివారణా మార్గాలు
కొన్ని వేప ఆకులు తీసుకుని కాల్చి ఇంట్లో పొగ వేస్తే… ఇంట్లో ఉండే బాక్టీరియా, వైరస్లు నశించిపోతాయి ఎలా ఇంట్లో మండించడం వలన వాస్తు దోషాలు ఏమైనా ఉన్న తొలగిపోతాయి.పూజ చేసేటప్పుడు మాత్రమే కాకుండా అగర్ బత్తీలను మాములు సమయం లో కూడా వెలిగిస్తే..దాంతో ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ తరిమేయబడుతుంది. అగర్బత్తీలను కేవలం బేసి సంఖ్యలో వెలిగిస్తే మంచిది
మంచాలు, టేబుల్స్, కుర్చీలు,సోఫాలు, ఇలా ఇంట్లో ఉన్న ఫర్నిచర్‌ను తీసి ఇంకో దిక్కులో పెట్టి కాసేపు ఉండనిచ్చి.. వాటిప్లేసు లో వాటిని సర్దుకోవాలి. ఇలా చేయడం వలన ఇంటిలో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే అది కాస్త పోయి పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది.
రెండు చిన్నపాటి గిన్నెల లో ఉప్పు ను నింపి అనంతరం ఆ రెండు గిన్నెలను ఇంట్లో ఈశాన్య, నైరుతి భాగాలలో పెట్టాలి. ఇలా చేస్తే నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా బయటకు పంపబడుతుంది. ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ తో నిండుతుంది.ఇంటి కిటికీలను ఎప్పుడు ఓపెన్ గా ఉంచుతూ వాటి దగ్గర కుండీల్లో మొక్కలను పెంచుకోవచ్చు. ఇలా చేస్తే నెగెటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ లోనికి వస్తుంది. దీంతో ఇంట్లో వారందరూ సంతోషంగా ఉంటారు. పొద్దున్న,సాయంత్రం కాస్త కర్పూరం తీసుకుని వెలిగించి అందులో కొన్ని లవంగాలను వేసి ఈ రెండింటినీ మండిస్తే ఇంటికి ఉన్న వాస్తు దోషం పోయి అదృష్టం పడుతుంది. ఆర్థిక సమస్యలు కూడా చక్కబడతాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?