NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌కు…ఆ టీఆర్ఎస్‌ నేత‌కు తేడా వ‌చ్చింది ఇక్క‌డేనా?

గ‌త కొంత‌కాలంగా టీఆర్ఎస్ పార్టీ రాజ‌కీయాలు ఆస‌క్తిని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, టీఆర్ఎస్ నేత,

శాసన మండలి మాజీ చైర్మన్ కే. స్వామి గౌడ్ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి తో ఓ కార్యక్రమంలో స్వామిగౌడ్ పాల్గొని… కొన్ని వర్గాల చేతుల్లోకే పరిపాలన పోతుందని, బలహీన వర్గాలు అణిచి వేయబడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో స్వామి గౌడ్ త్వరలో పార్టీ మారుతున్నారని… టీఆర్ఎస్ లో అతనికి తగిన ప్రాముఖ్యత లభించక పోవడమే దీనికి కారణమని వార్తలు వస్తున్నాయి.

ఒహ్‌…అస‌లు విష‌యం ఇదా?

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శ్రీ నారాయణగురు జయంతి వేడుకల్లో స్వామి గౌడ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కులాలే పరిపాలన , ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో గుడి , బడి కొంతమందికే పరిమితి కావడం బాధాక‌ర‌మ‌ని స్వామిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కుల రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ నారాయణ గురు ఆశయాలను బడుగు బలహీన వర్గాల ప్రజలు ముందుకు తీసుకెళ్లాలన్నారు. వందేళ్ల క్రితం ఏర్పడ్డ కుల రక్కసి పునాదులే ఇప్పటికి పరిపాలనను కొనసాగించడం… బలహీన వర్గాలపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. అనంత‌రం రేవంత్ రెడ్డిని ప్ర‌శంసించారు.

అస‌లు చ‌ర్చ‌కు భ‌లే చెక్‌

స్వామిగౌడ్ సంచ‌ల‌న కామెంట్లు చేయ‌డం, అవి వివాదా‌స్ప‌దం అయిన నేప‌థ్యంలో నిజంగానే పార్టీ మారుతారని అందరూ అనుకున్నారు. పార్టీ మారుతున్నార‌నే వార్తలపై స్వామి గౌడ్ స్పందించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని… టీఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేసారు. టీఆర్ఎస్ పై ఎలాంటి కోపం తనకు లేదని పేర్కొన్నారు. కానీ టీఆర్ఎస్ లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల పెత్తనం పెరిగిందని స్వామి గౌడ్ అన్నారు. దీనిపై సీఎం కెసిఆర్ దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసారు.

ఎంపీ సీటు కోస‌మే ఇంత జ‌రిగిందా?

శాసనమండలి చైర్మన్ హోదాలో పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు స‌మ‌యంలో స్వామిగౌడ్ మీడియా చిట్‌చాట్‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తనకు ఆరేళ్ల మండలి ఛైర్మన్ పదవి మంచి సంతృప్తి ఇచ్చిందన్నారు. పార్టీ ఆదేశిస్తే చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం అని ప్ర‌క‌టించారు. నేను లోక్‌సభకు పోటీ చేయాలనే అనుకుంటున్నానని తన మనసులోని మాట బయటపెట్టారు. సీఎం కేసీఆర్ త‌నపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకుంటాన‌ని చెప్పుకొచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడి ప్రజలతో ఓటు వేయించుకోవాలనే కసి నాలో ఉందన్న స్వామిగౌడ్ అది ఏ ఎన్నికలైనా సరే.. లోక్ సభ అయినా.. ఇంకా ఏదైనా సరే అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం శిరోధార్యం.. నాకు సొంత ప్రణాళిక ఏమీలేదన్నారు. అయితే, ఈ సీటు మ‌రో నేత‌కు ఇవ్వ‌డం, అక్క‌డ టీఆర్ఎస్ గెలుపొంద‌డం తెలిసిన సంగ‌తే. ఈ నేప‌థ్యంలో స్వామి గౌడ్ నారాజ్ అయ్యారా అనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

author avatar
sridhar

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N