కథ కథనం బావుంటే చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని ప్రేక్షకులు ఎప్పుడు ఆలోచించరు. ఆదరించడానికి ఏమాత్రం వెనకాడరు. అందుకు ఉదాహరణ విజయ్ దేవరకొండ నటించిన పెళ్ళి చూపులు, కమెడియన్ శ్రీనివాస రెడ్డి నటించిన జయంబు నిశ్శయంబురా.. కేరాఫ్ కంచెర పాలేం వంటివే. ఇక అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ కంటెంట్ తో వచ్చిన సినిమాతో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నాయి. కథ బలం.. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
అలాంటి సినిమానే ఇప్పుడు మరొకటి రాబోతుంది. రాజు గారి గది’ ఫేమ్ చేతన్ చీను – టిక్ టాక్ తో ఫేమస్ అయిన బన్నీ వాక్స్(వర్షిణి) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న నూతన చిత్రం ‘విద్యార్థి’. మధు మాదాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మహాస్ క్రియేషన్స్ బ్యానర్ పై ఆళ్ళ వెంకట్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను ప్రముఖ దర్శకులు సురేందర్ రెడ్డి – హరీష్ శంకర్.. నిర్మాతలు సాయి కొర్రపాటి – కె.ఎల్. దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు.
ఈ టీజర్ కి ప్రేక్షకులనుంచి.. సినీ ప్రముఖుల నుంచి గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి. “జాతీయ గీతం మీద అంత గౌరవం ఉన్న మీకు మా జాతంటేనే ఎందుకు సార్ అంత కోపం” అన్న డైలాగ్ తో ఈ సినిమా కథ కథనం ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఎమోషనల్ ఎలిమెంట్స్ తో కథతో ‘విద్యార్థి’ సాగుతుందని అందరూ భావిస్తున్నారు. ‘ఏంటే తక్కువ నాకొడుకుతో చాలా ఎక్కువగా తిరుగుతున్నావ్’ లాంటి డైలాగ్స్ ని బట్టి హీరో హీరోయిన్స్ పాత్రలు ఎలా రూపొందాయో హింట్ ఇచ్చారు మేకర్స్. “కంచెలు కట్టుబాట్లు మంచి చెడుల మధ్య ఉండాలి.. మనుషుల మధ్య కాదు. మనుషుల మధ్య హద్దులుండాలి.. అడ్డుగోడలు కాదు” వంటి డైలాగ్స్ ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెంచుతున్నాయి.
ఇక తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ లో లవ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ప్రధానంగా చూపించారు. ‘ఎలోన్ ఫైట్ ఫర్ లవ్’ అనే ట్యాగ్ లైన్ సినిమా కథా గమనం ఎలా ఉంటుదో. ఇక కొందరు ఈ సినిమాని విజయ్ దేరకొండ నటించిన అర్జున్ రెడ్డి తో కంపేర్ చేస్తున్నారు. మరి ఆ సినిమా మాదిరిగా ఎలాంటి సంచలన విజయం సాధిస్తుందో చూడాలి.