Newspaper Bag: ఇంజనీర్ తయారు చేసిన ఈ న్యూస్ పేపర్ బ్యాగ్ 10 కేజీల వరకు మోయగలదు

This Newspaper Bag can carry 10 kgs
Share

Newspaper Bag: కర్ణాటకకు చెందిన ధనుంజయ్ హెగ్డే అనే ఒక మెకానికల్ ఇంజనీరు న్యూస్ పేపర్ ను సరికొత్త అల్లికలతో కుట్టి దానిలో మొక్కజొన్న పొడి కలిపి ఇతర వ్యర్థ పదార్థాలతో ఒక సంచిని తయారు చేశాడు. ఈ సంచి దాదాపు పది కిలోగ్రాముల వరకు బరువు మోయగలదు.

 

This Newspaper Bag can carry 10 kgs

ఇప్పుడు మనం కూరగాయలు సామాన్లు మోసేందుకు ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగిస్తున్నాము. వీటితో చేపలు, పాల పొట్లాలు, ఇతర వ్యర్థ పదార్థాలను మోసేటప్పుడు ఎంతో కష్టంగా ఉంటుంది. కర్ణాటకకు చెందిన ధనుంజయ్ కూడా ఇదే సమస్య ను చూశారు. 2016లో రాష్ట్రం ప్లాస్టిక్ బ్యాగులను బ్యాన్ చేసింది. అయితే ఆ తర్వాత పాలీ ప్రోపైలిన్, పాలీ ఎస్టర్ పదార్థాలతో పైకి ఎటువంటి హాని చేయవని వాటిని అమ్మడం మొదలు పెట్టారు. 

Newspaper Bag: దీనికోసమే ప్రత్యేక మెషీన్

అయితే ధనుంజయ్ మాత్రం దీనికి పరిష్కారం ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే వాతావరణానికి మేలు చేసే ఎలాంటి బ్యాగ్ అయినా అర కిలోకు మించి బరువు మోయలేదు. కాబట్టి అతను వార్తాపత్రికలు సేకరించడం మొదలుపెట్టాడు. ఎన్నో కొత్త టెక్నిక్ లతో ఎటువంటి లీకేజ్ లేకుండా పది కిలోల బరువైన మాంసాన్ని కూడా మోయలిగే బ్యాగ్ ని తయారు చేసాడు. అందుకోసం ఒక మిషిన్ ను కూడా కనిపెట్టాడు.

మొదట్లో అరటి చెట్టు ఫైబర్ తో డబల్ షీట్ న్యూస్ పేపర్ తో ఒక సంచి ని తయారు చేద్దామని ప్లాన్ చేశాడు. ఆ తర్వాత ఒక సెంటీమీటర్ గ్యాప్ తో స్టిచ్చింగ్ చేయడం ద్వారా దానికి మరింత బలం చేకూరింది. అయితే అప్పటికి కూడా అది తడి, చెడు పదార్థాలు అది ఆపలేకపోయింది. తర్వాత దానికి ఒక పొరను వేశారు. సహజంగా దొరికే మొక్క జొన్న పొడి ద్వారా ఈ వాటర్ప్రూఫ్ లేయర్ ని వేసి సంచిని తయారు చేశారు. ఇలా ఎంతో శాస్త్రీయంగా తయారు చేసిన ఈ న్యూస్ పేపర్ సంచి బహు రకాలుగా ఉపయోగపడుతుంది. 

This Newspaper Bag can carry 10 kgs

Newspaper Bag: కేవలం రూ.2 మాత్రమే..!

దీనిని రోజు ఆఫీసుకి ధనుంజయ్ తీసుకొని వెళ్ళడం మొదలు పెట్టారు. తన తోటి ఉద్యోగులంతా దీని గురించి అతని ఆరా తీయడం మొదలు పెట్టగా వారికి కూడా కొన్ని చేయించాడు. ఇక ఈ బ్యాంకు ఒక్కొక్కటి కేవలం రెండు రూపాయలు మాత్రమే. మార్కెట్లో ఇదే సైజ్ సంచులు ఐదు, పది రూపాయలకు అమ్ముతున్నారు. ఇక దీని ద్వారా ఎన్నో బ్యాగ్లు తయారు చేయడం మొదలుపెట్టారు.

ఇలాంటి బ్యాగ్ లు తయారు చేసేందుకు అవసరమైన మెషిన్ పదిహేను లక్షల నుండి 20 లక్షల వరకు ఉంటుంది. అయితే వీరి న్యూస్ పేపర్ మెషీన్ మాత్రం కేవలం ఒకటిన్నర లక్షల్లోనే వచ్చేస్తుంది. రోజుకి మూడు వందల బ్యాగ్ తయారు చేసేవారు. యూజర్ ను బట్టి రకరకాలుగా సంచిలను కుడుతారు. దాదాపు 35 వ్యాపారస్తులు ఈ బ్యాగ్ లను కొనేందుకు అతనిని కాంటాక్ట్ అయ్యారు. అయితే అతను మాత్రం దీనికి తర్వాత మోడల్ తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా… ఉద్యోగం కల్పిస్తూ ఉపాధి కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.


Share

Related posts

ముగ్గురు ఉగ్రవాదులు అరెస్టు

Siva Prasad

బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం కావాలట!

somaraju sharma

చెన్నైలో ఐటీ దాడులు

somaraju sharma