NewsOrbit
న్యూస్

ఈ రియల్ క్రైమ్ స్టోరీ సినిమా కథకు ఏమాత్రం తీసిపోదు!రాంగోపాల్ వర్మ ట్రై చేసుకోవచ్చు!

ప్రాణానికి ప్రాణం అనే పగ,ప్రతీకారాలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ..మహారాష్ట్రంలో ఓ యువతి తన సోదరుడ్ని చంపినవాడిని చంపి తీరాలని అతనిపై ‘వలపు వల’విసిరింది. అందమైన అమ్మాయి పైగా వయస్సులో ఉన్న అమ్మాయి వలపు వల విసిరితే ఏ మగాడైనా పడకుండా ఉంటాడా? సదరు వ్యక్తి కూడా ఆ యువతి ‘హనీ ట్రాప్’లో పడ్డాడు.చేతికి అందివచ్చాడు. ఇక వాడిని అంతమొందిచి తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది.దీనికి పక్కాగా ప్లాన్ కూడా వేసింది. అయితే అది వర్కవుట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఈ స్టోరీ చివరివరకూ చదవండి!

హత్యకు దారి తీసిన పార్కింగ్ గొడవ

2020 జూన్‌లో ముంబైలోని మలాడ్ ప్రాంతంలో పార్కింగ్ విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవకాస్తా ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. ఈ క్రమంలో ఈ ఘర్షణ కాస్తా హత్య చేసేవరకూ వెళ్లింది. అల్తాఫ్ షేక్ అనే 24 ఏళ్ల యువకుడిని మహ్మద్ సాధిక్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఈ హత్య తర్వాత సాధిక్ భయపడి ఢిల్లీ నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో అల్తాఫ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్తాఫ్ మరణంతో అతని సోదరి యాస్మిన్ షాక్‌లోకి వెళ్లిపోయింది. సోదరుడంటే ఎంతో ప్రేమ కలిగిన యాస్మిన్ తన సోదరుడిని హత్య చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. సాధిక్ ను అంతమొందించటానికి సోదరుడు అల్తాఫ్ ఫ్రెండ్స్‌ ఫరూఖ్ షేక్(20), ఒవైస్ షేక్(18), మనీస్ సయ్యద్(20), జకీర్ ఖాన్(32), సత్యం పాండే(23)లతో కలిసి సాధిక్‌ను అంతమొందించాలని ప్లాన్ వేసింది

కిల్లర్ ను రప్పించటానికి హాని ట్రాప్

దీంట్లో భాగంగా ‘ఫస్ట్ స్టెప్’ గా ఢిల్లీనుంచి పారిపోయినవాడికి తిరిగి రప్పించటానికి వాడారు. దాని కోసం సాధిక్ ను హాని ట్రాప్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం అల్తాఫ్ సోదరి యాస్మిన్ ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసింది. ఆ అకౌంట్ నుంచి సాధిక్‌తో చాటింగ్ చేయడం ప్రారంభించింది.
అది తనను చంపటానికి వేసి హాని ట్రాప్ అని తెలియని సాధిక్..యాస్మిన్ చాటింగ్ ద్వారా చేసిన చాటింగ్ ప్రేమలో బొక్క బోర్లా పడిపోయాడు. అమ్మాయితో చాటింగ్ అంటే మరి అబ్బాయిలకు ఒళ్లూపై తెలీదు కదా..అలా యాస్మిన్ హానీ ట్రాప్ లో చిక్కుకున్నాడు సాధిక్..చాటింగ్ లో ఎన్నో విషయాలు చెప్పుకునేవారు. ఈక్రమంలో తన సోషల్ మీడియా ప్రియురాలు యాస్మిన్ సాధిక్ తనను పూర్తిగా నమ్మాడని నమ్మకం ఏర్పడ్డాక..‘సెకండ్ స్టెప్’ ను ఉపయోగించింది. నిన్ను చూడాలని ఉందని యాస్మిన్ కోరటంతో సాధిక్ ఆమెను కలవటానికి ముంబై వచ్చాడు. ఆ తరువాత యాస్మిన్ సాధిక్ కు ఫోన్ చేసి గత శనివారం (జనవరి9,2021) కశ్మీర్ లోని ఓ ప్రాంతం పేరు చెప్పి అక్కడకు రమ్మని కోరింది. అసలే చలి..పైగా ప్రేయసి రమ్మంటే రాకుండా ఉంటాడా..ఎన్నెన్నో ఊహించుకున్న సాధిక్ రెక్కలు కట్టుకుని కశ్మీర్ లో వాలిపోయాడు.
‘మూడో స్టెప్’ లో భాగంగా యాస్మిన్ కు బదులుగా కశ్మీర్ కు అల్తాఫ్ ఐదుగురు స్నేహితులు చేరుకున్నారు. వారు సాధిక్ రాక కోసం అంబులెన్స్‌లో ఎదురు చూస్తూ కూర్చున్నారు. వారి ఎదురుచూపులు ఫలించాయి. గురుడు సాధిక్ యాస్మిన్ చెప్పినచోటికి చేరుకున్నాడు. దీంతో అల్తాఫ్ స్నేహితులు అలెర్ట్ అయి..సాధిక్‌ను అంబులెన్స్‌లో ఎక్కించి రయ్ మంటూ లాగించేశారు. అలా సాధిక్ ను కిడ్నాప్ చేసి.. అతడిని వాసాయి నైగాన్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేయాలని అనుకున్నారు.

ఆఖరి నిమిషంలో బెడిసికొట్టిన ప్లాన్!

కానీ వాళ్లు పక్కాగా వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. సాధిన్ ను హత్య చేయలేకపోయారు.
యాస్మిన్ చెప్పిన ప్రాంతానికి సాధిక్‌ వచ్చిన వెంటనే అల్తాఫ్ స్నేహితులు సాధిక్ ను బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించడం కశ్మీర్ ప్రాంతంలోని స్థానికులు గమనించారు. దీంతో వాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన నార్త్ రీజియన్ పోలీసులు అంబులెన్స్‌ను ట్రెస్ చేసే పనిలో పడ్డారు.అలా ట్రేస్ చేసే యత్నంలో బిజీ అయ్యారు. ఈ క్రమంలో సాధిక్ ను కిడ్నాప్ చేసిన అంబులెన్స్‌లో పెట్రోలు అయిపోవడంతో వారు మరో కారును అద్దెకు తీసుకున్నారు. ఆ కారులో వారు వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే వైపు బయలుదేరారు. ఆ మార్గంలో అప్పటికే వీరిపై సమాచారం ఉన్న పోలీసులు కాచుకుని కూర్చోవటం అంబులెన్స్ తో సహా వారిని అందరినీ పట్టుకుని సాధిక్‌ను వారినుంచి రక్షించారు.

 

author avatar
Yandamuri

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju