NewsOrbit
న్యూస్

ఈసారి అయ్యన్నపాత్రుడు టార్గెట్ ఆ మహిళా మంత్రి!ఎందుకు? ఏమిటి??

టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మహా దూకుడు మీదున్నారు. ముఖ్యంగా ఆయన వైసిపి మంత్రులను టార్గెట్ చేస్తున్నారు.మొదటగా జగన్ ప్రభుత్వంలోని కార్మికమంత్రి జయరాం మీద అయ్యన్నపాత్రుడు అనేక అవినీతి ఆరోపణలు చేశారు.

ఒక వ్యవహారంలో మంత్రి జయరామ్ కు బెంజికారు కానుకగా లభించిందని బయటపెట్టారు.అదే మంత్రి జయరాం భూకబ్జాలకు కూడా పాల్పడ్డాడని మరో కుంభకోణాన్ని ఆయన వెలుగులోకి తెచ్చారు.ఇవి రాష్ట్రంలో సంచలనం రేపాయి.తాజాగా ఆయన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మీద విమర్శనాస్త్రాలు సంధించారు.గతంలో అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహించిన నర్సీపట్నంలో నిర్మించిన మోడల్ పోలీసు స్టేషన్ ని ఇటీవల హోంమంత్రి ప్రారంభించారు.దీనిపై ఆయన స్పందిస్తూ హోంమంత్రిపై పలు వ్యాఖ్యలు చేశారు.ఆ పోలీస్ స్టేషన్ను హోంమంత్రి తప్ప మరెవరు ప్రారంభించినా తాను సంతోషించేవాడినని ఆమె ప్రారంభించటం బాధ కలిగించిందని అయ్యన్నపాత్రుడు చెప్పారు.

హోంమంత్రి సుచరితకు ఏమీ తెలియదని, ఆమెకు హోం మంత్రికి ఉండే అధికారాలు కూడా తెలియవని అయ్యన్న పాత్రుడు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆమె బాగా చదువుకుందని తాను భావించానని కానీ వైఖరి చూస్తే ఆమెలో విషయం కనిపించడం లేదన్నారు.అసలు హోం మంత్రిగా ఆమె ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు.దళితురాలై వుండి ఆమె హోంమంత్రి అయినందుకు తామంతా సంతోషించామని..కానీ అదే దళితులకు పోలీసులపరంగా అనేక ఇబ్బందులు సమస్యలు కేసులు ఎదురవుతునా ఆమె స్పందించడం లేదన్నారు.ఈ ఏడాదిన్నర కాలంలో నూట ఎనభై మంది దళితులపై అక్రమ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు.ఈ విషయాలన్నీ హోం మంత్రిగా ఉండే సుచరితకు అసలు తెలుసా లేదా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తిపాడు సమీపంలో ఉండే రాజధాని అమరావతి ప్రాంతంలో మహిళోద్యమం మహా ఉధృతంగా సాగుతున్నప్పటికీ ఏనాడైనా ఒక మహిళా మంత్రిగా సుచరిత వారిని పరామర్శించారా అని అయ్యన్నపాత్రుడు ఆమెను ప్రశ్నించారు.రాష్ట్రంలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయని వీటన్నిటి అదుపునకు హోంమంత్రి ఏం చర్యలు తీసుకున్నారని ఆయన కడిగిపారేశారు.రాష్ట్రంలో ఇంకా అసలు దిశ చట్టమే లేనప్పటికీ రాష్ట్రంలో దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయటం వాటిని హోంమంత్రి ప్రారంభించడం కామెడీగా ఉందన్నారు.తుగ్లక్ ముఖ్యమంత్రి పాలనలో మంత్రులంతా ఇలాగే ఉంటారంటూ జగన్ మీద కూడా ఒక సెటైర్ కూడా విసిరారు.అయితే అకస్మాత్తుగా అయ్యన్నపాత్రుడుకు హోంమ౦త్రి సుచరిత మీద ఎందుకు ఆగ్రహం కలిగిందన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు.

 

author avatar
Yandamuri

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju