శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమాని నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా పీరియాడికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందుతుంది. మొఘలుల కాలం నాటి కథ కావడంతో ఈ సినిమా మీద అభిమానులకు, ప్రేక్షకులకు బాగా ఆసక్తి పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దొంగగా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది.
ఇక ఈ సినిమాకి ముందు నుంచి “విరూపాక్ష” అన్న టైటిల్ ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారకంగా ఇంకా టైటిల్ ఇదే అని చిత్ర యూనిట్ వెల్లడించలేదు. కాని సోషల్ మీడియాలో మరో రెండు టైటిల్స్ ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
“గజదొంగ” లేదా “బందిపోటు” అనే టైటిల్స్ అయితే పవన్ పాత్రకి సూటవుతాయన్న ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అయితే ఈ రెండు టైటిల్స్ అంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. దాంతో ఇప్పుడు మరో టైటిల్ వార్తల్లో నిలిచింది. అదే వీర అన్న టైటిల్. కాని ఈ టైటిల్ కూడా ఇంతకముందు వచ్చిందే. మాస్ మహారాజ రవితేజ, కాజల్ అగర్వాల్, తాప్సీ హీరో హీరోయిన్స్ గా రమేష్ వర్మ్ దర్శకత్వంలో వీర అన్న సినిమా 2011 లో వచ్చి అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇప్పుడు అదే పేరు ప్రచారంలోకి రాగానే ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైందట. మరి చిత్ర బృందం ఏ టైటిల్ ని ఫైనల్ చేస్తారో చూడాలి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాని వేణు శ్రీరాం తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు…బోనీకపూర్ సహ నిర్మాతగా ఉన్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.