Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ 12వ వారం లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి కంటెస్టెంట్ ల దిష్టిబొమ్మలను పగలగొట్టాల్సి ఉంటుంది. మొదటగా రవి(Ravi) వంతు రాగా.. సన్నీ(Sunny), కాజల్(Kajal) నీ నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పింకీ(Pinky)..సిరి(Siri), షణ్ముక్(Shanmuk) ని నామినేట్ చేసింది. ఈ క్రమంలో సీరితో పింకీ కి పెద్ద గొడవ అయింది.
తర్వాత షణ్ముక్… రవి, కాజల్ నీ నామినేట్ చేయడం జరిగింది. శ్రీ రామ్… సన్నీ, కాజల్ ..నీ నామినేట్ చేస్తూ వారి కుండ బద్దలు కొట్టడం జరిగింది. సన్నీ…రవి, శ్రీ రామ్ నీ… నామినేట్ చేశాడు. నెక్స్ట్ సిరి…పింకీ, రవి నీ నామినేట్ చేయడం జరిగింది. అనంతరం రంగంలోకి దిగిన కాజల్ రవి, శ్రీ రామ్ నీ నామినేట్ చేయడం జరిగింది. ఆ తరువాత కెప్టెన్ మానస్ కూడా రవి, శ్రీరామ్ నే నామినేట్ చేశారు. మొత్తం మీద కెప్టెన్ మానస్ మినహా మిగతా కంటెస్టెంట్ లు మొత్తం ఏడుగురు నామినేషన్ లో ఉన్నాను. దీంతో ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనేది సోషల్ మీడియాలో డిస్కషన్స్ స్టార్ట్ అయింది.
యాని మాస్టర్ గురించి
ఈ నామినేషన్ ప్రక్రియ లో.. కాజల్ కి శ్రీరామ్ కి అదే రీతిలో సన్నీకి శ్రీరామ్ కి ఇంకా రవి కి కాజల్ కి మధ్య భారీ ఎత్తున గొడవలు జరిగాయి. ఏవిక్షన్ ఫ్రీ పాస్ విషయంలో.. కాజల్ కి శ్రీ రామ్ కి పెద్ద గొడవ జరుగగా ఆ తర్వాత యాని మాస్టర్ గురించి.. శ్రీ రామ్ కి సన్నీ కి మధ్య కొట్టుకునేంత తరహాలో సీన్ క్రియేట్ అయింది. మొత్తంమీద సోమవారం జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా జరిగింది.