NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP : బెదిరింపులలో కన్నబాబుకు అన్న ఈ వైసిపి ఎమ్మెల్యే!ఎన్నికల్లో వైసిపికి ఎదురు ఎవరూ నిలవ కూడదంట!!

YSRCP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ వేడిని తారా స్థాయికి పెంచాయి.

This ysrcp mla is brother to kannababu regards bullying
This ysrcp mla is brother to kannababu regards bullying

తమ మద్దతుదారుల విజయం కోసం పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాయకులు.. కొన్ని సమయాల్లో నోరు జారుతున్నారు.అంతేగాక మొదటి విడత ఎన్నికల్లో వైసిపి ఆశించిన స్థాయిలో విజయాలు సాధించక పోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలపై పార్టీ పరంగా ఒత్తిడి కూడా పెరిగిందంటున్నారు.దీంతో కొందరు ప్రజా ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తున్నాయి.

YSRCP : వివాదాస్పదమైన జోగి రమేష్ వ్యాఖ్యలు!

తాజాగా కృష్ణా జిల్లా పెడన వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే.. ఆ గ్రామంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేరే పార్టీ నుండి వార్డు మెంబర్‎గా పోటీ ‌చేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయండంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు‌ చేస్తున్నారని ఆయన చెప్పారు. అయినా కూడా వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే.. పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తాం అని హెచ్చరించారు. జోగి రమేష్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.

ఎస్‌ఈసీకి ఫిర్యాదు యోచనలో టిడిపి!

దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలను టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఖండించారు. జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. బెదిరింపులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలని అనుకోవడం దారుణం అన్నారు. ఎమ్మెల్యే తీరుని ప్రజలు గమనిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని ప్రతిపక్ష నేతలు అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది.

కన్నబాబుతో మొదలు!

యలమంచిలి వైసిపి ఎమ్మెల్యే కన్నబాబు కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడం,తన నియోజకవర్గ పరిధిలో సర్పంచ్ పదవికి పోటీకి దిగిన అభ్యర్థి అల్లుడిని ఫోన్లో బెదిరించటం,ఒక గ్రామానికి ప్రచారానికి వెళ్లి అక్కడి ఓటర్లను కూడా హెచ్చరించడ౦ తెలిసిందే.

 

author avatar
Yandamuri

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju