NewsOrbit
National News India ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్

Budget 2024: ఆ నాలుగు వర్గాలు ప్రభుత్వ ప్రాధాన్యం: నిర్మలా సీతారామన్

Those four categories are government priority Nirmala Sitharaman

Budget 2024: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఆరోసారి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. పదేళ్లలో మోడీ నాయకత్వంలో తీసుకువచ్చిన ఆర్ధిక సంస్కరణలు ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేశాయని తెలిపారు. బాధ్యతాయుతంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆర్ధిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ తమ లక్ష్యంగా అని స్పష్టం చేశారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యం అని వివరించారు. ఆ వర్గాల మేలు కోసం పాటు పడతామని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకు కేంద్ర బహుముఖీయ విధానాలతో పని చేస్తొందని అన్నారు.

Those four categories are government priority Nirmala Sitharaman
Those four categories are government priority Nirmala Sitharaman

అభ్యుదయ భారతదేశ నిర్మాణ బాధ్యతకు కట్టుబడి ప్రభుత్వం పని చేస్తొందని చెప్పారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే మంత్రంతో అందరినీ కలుపుకోని వెళ్తొందని చెప్పారు. కుల, మత, అర్ధిక భేదాలు లేకుండా అన్ని వర్గాల సమాన అవకాశాలు కల్పించడమే తమ విజన్ అని ఆర్ధిక మంత్రి తెలిపారు.పేదలు, మహిళలు, యువత, రైతులకు ఆత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తమ ప్రభుత్వం అనేక నిర్ణయాలను తీసుకుందని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలను అందించామని తెలిపారు. జన్ ధన్ ఖాతాల ద్వారా రూ.34 లక్షల కోట్లు అందించామని చెప్పారు. రూ.2.20 లక్షల కోట్లు పూచికత్తు లేని రుణంగా అందజేశామని చెప్పారు.  వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికతను విలువను జోడించే విధానాలను తెచ్చామని చెప్పారు. స్కిల్ ఇండియా పేరుతో కోటి 40 లక్షల మంది యువతకు నైపుణ్యలో శిక్షణ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ముద్ర యోజన పథకం ద్వారా 30 కోట్ల మందికి రుణాలు అందించామని అన్నారు.

Those four categories are government priority Nirmala Sitharaman
Those four categories are government priority Nirmala Sitharaman

కొత్తగా 16 ఐఐటీలు, ఏడు ఐఎంఎలు ప్రారంభించుకున్నామని చెప్పారు. ఉపాధి అవకాశాలు పెరిగేలా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని అన్నారు. మధ్య తరగతి కోసం నూతన గృహ నిర్మాణం విధానాన్ని తెస్తున్నామని మంత్రి తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామని చెప్పారు. కొత్త ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు ప్రభుత్వం మద్దతిస్తుందని చెప్పారు. పదేళ్లలో ప్రజల వాస్తవ ఆదాయం 50 శాతం పెరిగిందన్నారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 30-0 యూనిట్లు ఉచిత విద్యుత్ ను అందిస్తామని తెలిపారు. రానున్న అయిదేళ్లలో పీఎం ఆవాజ్ యోజన పథకం కింద రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాలను చేపడతామని అన్నారు.

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju