Tollywood: సినిమా ఇండస్ట్రీని ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఒక ఊపు ఊపారు. ఈ దిగ్గజ హీరోలు అన్ని జానర్ల సినిమాల్లోనూ నటించి అభిమానుల మనసు గెలుచుకున్నారు. అయితే కొన్ని సినిమాల్లో వీరు ఒకే హీరోయిన్‌తోనే మళ్లీ జతకట్టారు. నట సార్వభౌమ ఎన్టీఆర్ కూడా మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు వంటి సినిమాల్లో సావిత్రితో కలిసి నటించారు. అలా హీరో, హీరోయిన్ల కాంబో రిపీట్ కావడం అప్పటి నుంచే మొదలైంది. శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు కూడా విజయశాంతి, భానుప్రియ, రాధా వంటి అప్పటి హీరోయిన్లతో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేశారు.
కానీ ఇప్పుడు ఉన్న హీరోలు ఒకసారి కంటే ఎక్కువగా ఒకే హీరోయిన్‌తో మళ్ళీ కలిసి నటించడం లేదు. ఎందుకంటే డైరెక్టర్లతో పాటు హీరోలు కూడా హీరోయిన్ల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మళ్లీ అదే హీరోయిన్‌తో వెంట వెంటనే గుడ్డిగా నటించేందుకు సిద్ధమైతే అభిమానుల్లో రోటీన్ అనే ఫీల్ వస్తుందని ఇందుకు దూరంగా ఉంటున్నారు. ప్రతి సినిమాలోనూ కొత్త హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేయాలనుకుంటున్నారు. ఇక హీరోయిన్లు సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోయిన్స్ మాత్రం చాలా బిజీగా గడుపుతున్నారు. దాంతో వారి డేట్స్ దొరకక కొత్త హీరోయిన్లతో హీరోలు సినిమాలు ఫినిష్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం టాలీవుడ్లో కొందరు స్టార్ హీరోలు గతంలో నటించిన హీరోయిన్లతోనే మళ్లీ జోడి కట్టనున్నారు. ఆ హీరో హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి సైరా మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఇంకో సినిమా రాబోతుంది. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి, తమన్నా కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు, పూజా హెగ్డే కలిసి మహర్షి సినిమా చేసిన సంగతి విదితమే. అయితే వీరి కాంబోలో ఇప్పుడు మరొక సినిమా రానుంది. దీనిని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కియారా అద్వానీతో మళ్లీ జోడి కట్టబోతున్నాడు. గతంలో వీరిద్దరూ వినయ విధేయ రామ సినిమాలో రొమాన్స్ చేశారు.
నేను లోకల్ మూవీలో నాని సరసన నటించి అభిమానుల మనసులు దోచుకుంది కీర్తి సురేష్. మళ్లీ నానితో ‘దసరా’ అనే ఓ పీరియడ్-యాక్షన్ డ్రామా సినిమాలో రొమాన్స్ చేయడానికి మహానటి సిద్ధమైంది. ఈ సినిమా దసరాకి విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్రయత్నిస్తోంది. నాగచైతన్య, రాశి కన్నా కూడా థాంక్యూ సినిమాతో మరోసారి ఆన్‌స్క్రీన్‌పై సందడి చేయనున్నారు. విజయ్ దేవరకొండ, సమంత ‘మహానటి’ సినిమాలో కనిపించగా వారిద్దరూ ఖుషి అనే మూవీలో మళ్ళీ ఒకే స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎలా అయితేనేం చాలా కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయి. మళ్లీ తెరపై ఈ కాంబినేషన్స్ చూసి అభిమానులు ఎంజాయ్ చేయనున్నారు.
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…
ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…