Akhanda: ‘అఖండ’ సక్సెస్‌తో ఆ ఇద్దరికి మొదలైన టెన్షన్..ఎలా తట్టుకుంటారో..!

Share

Akhanda: నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే యాక్షన్ ఫ్యాక్షన్ కలిసిన కథ కావాల్సిందే. అలాంటి కథ దొరికితే రికార్డుల మోత మోగిస్తారు బాలయ్య. అలాంటి కథతో బాలయ్యకు బోయపాటి శ్రీను లాంటి దర్శకుడు ఎదురైతే ఇక తిరుగుండదు. బాలయ్య – బోయపాటి ఇప్పుడు అదే నిరూపించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సింహ, లెజెండ్ సినిమాలొచ్చి భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. బాలయ్యకు మంచి మాస్ హిట్ కావాల్సిన సమయంలో దక్కిన హిట్స్ ఈ రెండు సినిమాలు.

those two directors are in tension due to akhanda-success
those two directors are in tension due to akhanda-success

ఇప్పుడు కూడా అంతే జరిగింది. బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ హిట్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ దక్కలేదు. ఇక దర్శకుడు బోయపాటికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ తర్వాత మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అలాంటి సమయంలో బాలయ్య హ్యాట్రిక్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఆ అవకాశాన్ని బోయపాటి సరిగ్గా ఉపయోగించుకున్నారు. బాలయ్య నుంచి జనాలు ఈ మధ్య కాలంలో ఏం మిస్ అయ్యారో అవన్నీ అఖండలో చూపించారు. దాంతో ఇద్దరికీ భారీ కమర్షియల్ హ్యాట్రిక్ దక్కింది.

Akhanda: ఆ దర్శకులిద్దరి మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిందని టాక్ వినిపిస్తోంది..

అయితే ‘అఖండ’ హిట్‌తో ఇప్పుడు బాలయ్యతో నెక్స్ట్ సినిమాలు చేయబోతున్న దర్శకులిద్దరి మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిందని టాక్ వినిపిస్తోంది. వారే గోపీచంద్ మలినేని. క్రాక్ లాంటి మాస్ హిట్ తర్వాత బాలయ్యతో సినిమా ఇటీవలే మొదలుపెట్టారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పుడు గోపీచంద్ మలినేనిలో బాలయ్యకు భారీ హిట్ ఇవ్వాలనే పట్టుదల మరింత పెరిగింది. అదే కసి అనిల్ రావిపూడికి ఉంది. ఎఫ్ 3 తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా బాలయ్యతోనే చేయబోతున్నాడు. అఖండ ప్రభావం ఈ దర్శకుడి మీద బాగా పడింది. మరి ఈ ఒత్తిడిని తట్టుకొని బాలయ్యకు హిట్ ఇస్తారా లేదా చూడాలి.


Share

Related posts

Pavan Kalyan: నా ఆరోగ్యం బాగానే ఉంది.. ఆందోళన చెందవద్దు: పవన్ కళ్యాణ్

bharani jella

Congress Party : ఎమ్మెల్సీ ఫలితాలతో తెగ వర్రీ అవుతున్న తెలంగాణ కాంగ్రెస్!

Yandamuri

‘ఈసి తీరు ఆక్షేపణీయం’

somaraju sharma