న్యూస్ సినిమా

Vijay Devarakonda: విజయ్ దేవరకొండను పరుగులు పెట్టిస్తున్న ఆ ఇద్దరు దర్శకులు..!

Share

Vijay Devarakonda: పాన్ ఇండియన్ రేసులో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న లైగర్ విజయ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. మైక్ టైసన్ కీలక పాత్రలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ సినిమాను పూరి తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. పూరి కనెక్ట్స్ – ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరి జగన్నాథ్ – ఛార్మీ – కరణ్ జొహార్ రూ 120 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

those two directors are waiting for vijay-devarakonda
those two directors are waiting for vijay-devarakonda

అయితే, ఈ సినిమాను కంప్లీట్ చేసిన పూరి – విజయ్ దేవరకొండ వెంటనే జనగణమన షూటింగ్ కూడా మొదలుపెట్టారు. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ సినిమాను కూడా ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగం ముంబైలో జరుగుతోంది. ఇంకా హీరోయిన్ కన్‌ఫర్మ్ కాని ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ ఎక్కువగా విజయ్ మీద పూరీ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది ప్రకటన వచ్చిన శివ నిర్వాణ – విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కడానికి ప్లాన్స్ జరుగుతున్నాయట.

Vijay Devarakonda: భారీ హిట్ అందుకోవాలని కసిగా ఉన్నాడు.

దీని షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్‌లో జరగబోతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాది చివరి వరకు కంప్లీట్ చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారట. కాబట్టి షూటింగ్ మొదలైతే శివ నిర్వాణ కూడా నాన్ స్టాప్‌గా చిత్రీకరణ జరపుతాడు. నిన్నుకోరి, మజిలీ చిత్రాలలో వరుస హిట్స్ అందుకున్న శివ నిర్వాణ మూడవ సినిమాగా టక్ జగదీష్ చేసి ఫ్లాప్ అందుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సినిమా చేస్తే ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని కసిగా ఉన్నాడు. అందుకే, విజయ్‌తో చేసే ప్రాజెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైతే విజయ్ ముంబై టు హైదరబాద్..టు ముంబై పరుగులు పెట్టాల్సిందే అంటున్నారు.


Share

Related posts

Immunity Power: ఈ లక్షణాలు ఉంటే ఇమ్యూనిటీపవర్ లేనట్టే..!!

bharani jella

Bithiri Sathi : శ్రీదేవి డ్రామా కంపెనీలో బిత్తిరి సత్తి హంగామా? నూకరాజుతో కలిసి చేసిన కామెడీ అదుర్స్?

Varun G

తెలుగుదేశం పోత్తుతో కాంగ్రెస్‌కు నష్టం

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar