కాంప్రమైజ్ అయిపోయిన ఆ ఇద్దరు వైసీపీ నేతలు..??

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కి అదేవిధంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య ఇటీవల వివాదాలు రాజుకున్న సంగతి తెలిసిందే. మొన్న తూర్పుగోదావరి సమీక్ష సమావేశంలో ఇద్దరు నేతల మధ్య బహిరంగంగా మీడియా ముందు మిగతా నాయకులు ఉన్న సమయంలో ఒకరిపై మరొకరు దారుణమైన విమర్శలు చేసుకున్నారు.

డీఆర్‌సీ సమావేశంలో రభస: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి మధ్య వాగ్వాదం | war words between mp pilli subash chandrabose, mla dwarampudi chandrasekhar reddy lnsటిడ్కో ఇళ్ల కేటాయింపులో లక్షల రూపాయలకు వసూలు పాల్పడుతున్నారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించడం జరిగింది . దీనిపై అక్కడే ఉన్న ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అభ్యంతరం తెలిపారు. దీంతో ఇద్దరు నేతల మధ్య నువ్వానేనా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఈ గొడవకు సంబంధించి వీడియో న్యూస్ ఛానల్ లో వైరల్ కావడంతో విషయం జగన్ దృష్టి దాక రావటంతో.. ఇద్దరికీ జగన్ క్లాస్ తీసుకోవటం జరిగింది.

 

ఈ దెబ్బతో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేతల మధ్య వర్గ విభేదాలు సమసిపోయాయి. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి ఎంపీ సుభాష్ చంద్రబోస్ వెళ్లడంతో వ్యవహారం చల్లబడినట్లు అయింది. ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చిన ఏడాదిన్నర కాలం లోనే కొన్ని ప్రాంతాలలో పార్టీలో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. అయితే అన్నిటిలో కన్నా తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల సుభాష్ చంద్రబోస్ అదేవిధంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ మధ్య చోటు చేసుకున్న సంఘటన హైలెట్ కావడంతో ఈ విషయం ఏపీ రాజకీయవర్గాలలో పెద్ద హాట్ టాపిక్ అవటంతో.. పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండటంతో వెంటనే జగన్ రంగంలోకి దిగి ఇద్దరిని కాంప్రమైజ్ తాజాగా చేయడం జరిగింది. ఇద్దరు నేతలను తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ కి పిలుచుకుని క్లాసు పీకటం జరిగింది. బహిరంగ వేదికలపై పార్టీ పరువు పోయేలా విమర్శలు చేసుకోవద్దని ఇతర నేతలకు జగన్ చురకలు అంటించిన ట్లు పార్టీలో టాక్. దీంతో ఇద్దరు నేతలు పార్టీ సెట్ రేట్ అవటంతో ఐక్యత చాటే విధంగా జిల్లాలో భేటీ అవుతున్నారు.