NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Thota Trimurthulu: దళితుల తోబుట్టువు నేను.. పోయిన చోటే నెగ్గించుకున్న తోట..!!

Thota Trimurthulu: Great Facilitation by SC Crowd

Thota Trimurthulu:* దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం..
* నాటి ఘటన మనసుని గాయపర్చిందన్న తోట..!

Thota Trimurthulu: రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు.., వివాదాలు.., వ్యాఖ్యలు సహజమే..! వీటన్నిటికీ సిద్ధపడే చాలా మంది రాజకీయాల్లోకి వస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి మనసులో పేరుకుపోతాయి. మనసుని గాయపరుస్తాయి. ఎల్లకాలం వెంటాడతాయి. రాజకీయంగా చెడు ముద్ర వేస్తాయి. ప్రత్యర్దులకు ఆయుధాలుగా మారతాయి..” దీనికి కచ్చితమైన ఉదాహరణ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…! 1996 నాటి ఒక చిన్న ఘటనను తీసుకుని ప్రత్యర్ధులు ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెట్టె ప్రయత్నాలు చేసారు. వివాదం సృష్టించడంలో విజయవంతమయ్యారు. కానీ నాటి ఆ వివాదాన్ని ఎదుర్కొని, మలుచుకుని, జనం మనిషిగా ముందుకెళ్లి ఎదగడంలో తోట త్రిమూర్తులు విజయం సాధించారు. వివాదం నేర్పిన పాఠంతో దళితులకు మరింత సన్నిహితుడిగా మారి, వారికి తోడుంటూ వారి ఓట్లతోనే వరుసగా గెలుస్తూ వచ్చారు.. తాజాగా ఈరోజు మండపేటలో జరిగిన తోట సన్మాన కార్యక్రమం కూడా ఇదే విషయాన్నీ నిరూపించింది. తోట త్రిమూర్తులకు సీఎం జగన్ ఇటీవల ఎమ్మెల్సీ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మండపేట, సమీప ప్రాంతాల దళిత సంఘాలు, దళిత నేతలు తరలివచ్చి తోటని ఘనంగా సత్కరించారు. ఊరంతా ఊరేగించి, భుజాన మోసి, తోట నాయకత్వం పట్ల తమ భరోసాని చాటుకున్నారు..!

Thota Trimurthulu: Great Facilitation by SC Crowd
Thota Trimurthulu Great Facilitation by SC Crowd

Thota Trimurthulu: తోట ఏమన్నారంటే..!?

ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “దళితుల రుణం తీర్చుకుంటానని, దళిత సోదరులకు తనకు మధ్య దూరం పెంచాలని కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని, వారి కుట్రలు సాగవని పేర్కొన్నారు. దళిత సోదరులు అండదండలతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న తరుణంలో ఒక్కొక్కరికి రూ 500 నుంచి వెయ్యి రూపాయల వరకు కూలి వస్తుందని తన మీద ఉన్న అభిమానంతో ఈ రోజు కూలీ పనులు మానుకొని సత్కార సభకు అశేష సంఖ్యలో విచ్చేసిన ఎస్సీ సోదరులు రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలు బయట మాట్లాలడాకుడదనే ఉద్దేశ్యంతో మౌనంగా ఉన్నానని, మాట్లాడం చేతకాక కాదన్నారు. వాట్సప్ లలో కొందరు చేస్తున్న దుష్ప్రచారం పై అదే రీతి లో సమాధానం ఇవ్వగలనని అయితే కోర్టు పరిధిలో అంశాలు ప్రస్తావించి ధిక్కరించడం ఇష్టం లేదన్నారు. రామచంద్రపురం వెళ్లి ఎస్సి సామాజిక వర్గానికి చెందిన ఎవరినైనా తన గురించి అడిగితే తాను వారి సంక్షేమం కోసం ఏమేమి చేసానో చెబుతారని పేర్కొన్నారు. తనకి ఎవరి మీద కోపం, ద్వేషం లేదన్నారు. ఎస్ సి ల నుండి తనను దూరం చేసేందుకు కొంత మంది వ్యక్తులు చేసే ప్రయత్నమని పేర్కొన్నారు. మండపేట చరిత్రలో ఈ సభ నిలిచిపోతుందని పేర్కొన్నారు. తనపై అభిమానం ఉంచిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. 2024 ఎన్నికల ముందే ఈ నియోజకవర్గంలోని ఎస్సీ సోదరుల దీర్ఘకాలిక సమస్యలు అన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు”..!

Thota Trimurthulu: Great Facilitation by SC Crowd
Thota Trimurthulu Great Facilitation by SC Crowd

నాటి ఘటనపై కాస్త మౌనంగానే…!

1997 నాటి ఘటనని తోట గుర్తు చేసుకున్నారు. మనసుని గాయపరిచింది అను చెప్తూనే.. దళితులకు తాను ఎంత దగ్గరి వాడినో నిరూపించారు. “దళితులు, బీసీలు అని సంబంధం లేకుండా తాను అందరిలో ఒకడిగా ఉంటానని, అందరి మన్ననలు పొందుతానని స్పష్టం చేశారు. తాను 1994లో స్వతంత్ర అభ్యర్థిగా రామచంద్రపురం నియోజకవర్గంలో పోటీ చేస్తే తన వెన్నంటి ఉండి తన గెలుపుకు కారణమైన దళిత సోదరులు రుణాన్ని తీర్చుకుంటానన్నారు. దాదాపు 25 ఏళ్ళ అనుబంధం వారితో ఉందన్నారు. ఈ క్రమంలో 1997 లో జరిగిన ఓ సంఘటన తన మనసును గాయపర్చిందన్నారు. శిక్షలకు భయపడేవాడిని కాదని కేసులకు తలొగ్గే నేతను అసలే కాదని స్పష్టం చేశారు. పేద బడుగు బలహీన వర్గాల మద్దతుతోనే పార్టీలకతీతంగా దీర్ఘకాలికంగా శాసనసభ్యుడిగా పని చేశానని పేర్కొన్నారు. టిడిపి, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిగా తాను ఎమ్మెల్యేగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని ఎన్నికల్లోనూ తన గెలుపు లో ఎస్సీలు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అటు రామచంద్రపురం ఇటు మండపేట నియోజకవర్గం లో తనను ఆదరిస్తున్న దళిత సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు”..!

Thota Trimurthulu: Great Facilitation by SC Crowd
Thota Trimurthulu Great Facilitation by SC Crowd

వేలాదిగా తరలివచ్చినే అభిమానులు….!

ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. వేలాది మంది దళిత సంఘాల కార్యకర్తలు, నేతలు, ప్రజలు తరలి వచ్చి మండపేట వీధుల్లో తోట త్రిమూర్తులను భుజాన మోసి ఊరేగించారు. శాలువాలు, మెమొంటోలు, స్మారక చిహ్నాలతో త్రిమూర్తులను సత్కరించి.. తమ కోసం ఆయన చేసిన పనులను గుర్తు చేశారు. రెండున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న తోట దళితుల సంక్షేమం కోసం అనేక విధాలుగా పాటుపడ్డారని దళిత సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం స్పందన చూసి తోట కూడా ఓ సందర్భంలో ఉద్వేగానికి లోనయ్యారు. దళిత నేతలకు, ప్రజలకు, సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు..!!

author avatar
Srinivas Manem

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju