NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న ర్యాలీలు, సదస్సులు

వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో మూడు రాజధానుల సాధన పోరాట సమితి (జేఏసి) ఆధ్వర్యంలో విద్యార్ధుల ర్యాలీలు, సదస్సులు కొనసాగుతున్నాయి. అనకాలపల్లి జిల్లా చోడవరంలో విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేతలు లజపతిరాయ్, దేవుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది విద్యార్ధులు పాల్గొనగా, వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హజరై ప్రసంగించారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. టీడీపీ, తోక పార్టీలు పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు.

Three Capital Support Rally

 

మన విశాఖ .. మన రాజధాని పేరుతో శ్రీకాకుళం లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తే చంద్రబాబు దానిని విస్మరించారని ధర్మాన అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు మంచి రాజధాని అవసరం ఏర్పడిందన్నారు. పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి రెండేళ్లకే ఖాళీ చేశారని విమర్శించారు. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధమని చెప్పారు. పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని కోసం 3,500 రహస్య జీవోలు ఇచ్చారని అన్నారు.

Darmana Prasad

 

ఆంధ్రప్రదేశ్ లో ఒకే రాజధాని పెట్టడం మంచిది కాదని కేంద్రం నియమించిన కమిటీయే చెప్పిందన్నారు. ఆంధ్ర రాజకీయ పరిస్థితులను బట్టి పరిపాలన వికేంద్రీకరణ చేయాలని గతంలోనే డిమాండ్ వచ్చిందని చెప్పారు. ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో హైకోర్టు ఉండగా, భూవనేశ్వర్ పరిపాలన రాజధానిగా ఉందని గుర్తు చేస్తూ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతోందని తెలిపారు. అభివృద్ధి అసమానత ఉంటే రాష్ట్రంలో అస్థిరత ఏర్పడుతుందన్నారు. అందుకే జగన్మోహనరెడ్డి ముందు చూపుతో ఆలోచన చేసి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, దీన్ని రాష్ట్రంలోని ప్రజలు అందరూ మద్దతు ఇస్తున్నారని అన్నారు.

Hawala Cash: జూబ్లిహిల్స్ లో భారీ ఎత్తున హవాలా నగదు స్వాధీనం

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju