NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేంద్రం చేతిలో కీలక బిల్లు..!! ఇక వ్యవసాయంలో మార్పులే..!!

three farm sectors bills

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వ్యవసాయ బిల్లుపై సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా.. మోదీ ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. రైతుల శ్రేయస్సు కోసమే కొత్త వ్యవసాయ బిల్లు అని చెప్తోంది. రైతుల పంటలకు ప్రోత్సాహకం అందించడం, సులభతరంగా విక్రయించుకోవడం కోసమే ఈ బిల్లు ప్రవేశపెడుతున్నామని అంటోంది. ఈ బిల్లులోని ప్రధానాంశాలను తీసుకుంటే..

  • పండించే ఉత్పత్తులకు వ్యాపార, వాణిజ్య అవకాశాలు: ఈ బిల్లు వల్ల రైతులు తమ పంటల్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెట్ యార్డుల్లో మాత్రమే విక్రయించే అవసరం ఉండదు.
  • ధరల హామీ, సేవల ఒప్పందం: ఈ బిల్లుతో రైతులు పండించే పంటకు ధరల హామీ లభిస్తుంది. పంటలు వేయడానికి ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకోవచ్చు. ఇందుకు చట్టబద్ధత కూడా వస్తుంది.
  • నిత్యావసర సరుకుల బిల్లు: పండించిన చిరు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోతాయి.
three farm sectors bills
three farm sectors bills

 

మిత్రులే షాకిచ్చిన మోదీకి జగన్ అండగా..

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఉత్తరాదిన రైతులు రోడ్డెక్కారు. వీరికి రాష్ట్రాల ప్రభుత్వాలు, అనేక పార్టీలు మద్దతుగా నిలుస్తూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సీఎం జగన్ మాత్రం ప్రధాని మోదీకి అండగా నిలిచి ప్రత్యేకంగా నిలిచారు. సభలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తోందని ప్రకటించారు. అయితే.. వ్యవసాయ మార్కెటింగ్‌లో విశృంకలత్వాన్ని నిర్మూలించాలని ఏపీఎంసీ మర్కెట్లలో రాష్ట్రాలకు నష్టాలు వస్తున్నాయని వాటిని కేంద్రం భరించాలని వైసీపీ తరపున కోరుతున్నామని అన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఏపీ మద్ధతు లభించినట్టైంది.

నమ్మకమైన మిత్రపక్షమే వ్యతిరేకించింది ఎందుకు..

తాము ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై ఎంత వ్యతిరేకత వచ్చినా మిత్రపక్షాల అండ ఉంటుందని బీజేపీ భావించడం సహజమే. కానీ.. గురువారం లోక్ సభలో చర్చ అనంతరం బీజేపీతో చిరకాల మితృత్వం, భాగస్వామ్యం ఉన్న శిరోమణి అకాలీదళ్ వ్యవసాయ బిల్లుల్ని  వ్యతిరేకించడం చర్చనీయాంశమైంది. ఏకంగా ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేయడం కలకలం రేపింది. పంజాబ్ లో లక్షలాది రైతులు రోడ్లపై నిరసన తెలియజేయడం.. వారి వ్యతిరేకతను ఎదుర్కోలేకే ఎంపీ రాజీనామాకు కారణమని విశ్లేషిస్తున్నారు.

author avatar
Muraliak

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?