థాంక్యూ సినిమాతో ఈ ముగ్గురు హీరోయిన్ల భవిష్యత్తు మారేనా..?

Share

జులై 22న రిలీజ్ కానున్న థాంక్యూ సినిమాలో నాగచైతన్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటించారు. వారే అవికాగోర్, రాశీ ఖన్నా, మాళవిక నాయర్. ఈ ముద్దు గుమ్మలు ఒకేసారి ఒకే సినిమాలో హీరోయిన్లుగా నటించడం ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. వీరంతా ఎలా కనిపించబోతున్నారు తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి వీరంతా కూడా గత కొంతకాలంగా ఫ్లాప్స్ నే మూట పెట్టుకున్నారు. దీంతో ఈ ముగ్గురు హీరోయిన్స్‌కి థాంక్యూ సినిమా హిట్ అవ్వడం అత్యవసరంగా మారింది.

హిట్ కంపల్సరీ

అవికగోర్ స్లిమ్ గా తయారయ్యాక గ్లామర్ షో చేస్తుంది. అయినా కూడా ఈ అమ్మడుకు అవకాశాలు రావడం అంతంత మాత్రంగానే ఉంది. థాంక్యూ సినిమాలో అవికాగోర్, నాగచైతన్యకు రాఖీ కట్టి అన్నయ్యని చేసింది. దానివల్ల ఈ సినిమాలో అవికా క్యారెక్టర్ కొంచెం సస్పెన్స్ గానే ఉంది. ఆమె నిజంగానే చెల్లెలా లేక నాగచైతన్యకు రాఖీ కట్టి అతడిని తన వెంట ఫాలో కావద్దని చెబుతుందా అనేది తెలియాల్సి ఉంది. బుజ్జిగాడు ప్రేమ సినిమాలో చాలా మంది ప్రేక్షకుల మనసుల్ని దోచేసిన మాళవిక నాయర్‌కు కూడా ఈ సినిమా హిట్ కొట్టడం చాలా ముఖ్యం. ఎందుకని అడిగితే, ఆమె కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోయినే. థాంక్యూ సినిమాలో నాగచైతన్య పదహారేళ్ల వయసు ఉన్నప్పుడు మాళవికను లవ్ చేసినట్టుగా ట్రైలర్‌లో చూపిస్తున్నారు. అయితే ఆమె క్యారెక్టర్ మాత్రం ఎంతసేపు ఉంటుందో అనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది.

రాశీ ఖన్నాకి కూడా ముఖ్యమే

ఇక ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ రాశి ఖన్నా. ఆమె పక్కా కమర్షియల్ లాంటి ఒక డిజాస్టర్ మూవీలో నటించింది. ఆ మూవీ తరువాత ఆమె ‘థాంక్యూ’ సినిమా పైన హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అవ్వకపోతే మాత్రం ఆమె టాలీవుడ్‌లో ఎక్కువగా అవకాశాలు పొందడం కష్టమవుతుంది. అందువల్ల ఆమెకి కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. ఆ విధంగా థాంక్యూ సినిమాపై ముగ్గురు హీరోయిన్స్ కెరీర్ ఆధారపడి ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకులకు కూడా చాలా అంచనాలు ఉన్నాయి. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ‘మనం’  సినిమాలో నటించాడు. మనం సినిమా బ్లాకబస్టర్ హిట్ అవడంతో ప్రేక్షకులు ఇప్పుడు ‘థాంక్యూ’ సినిమా పై ఇంకా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

26 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

30 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

47 నిమిషాలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

1 గంట ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

2 గంటలు ago