Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ (Bigg Boss)హౌస్ లో “టిక్కెట్ టూ ఫినాలే టాస్క్” చాలా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఎలాగైనా ఈ టాస్క్ లో గెలిచి టాప్ ఫైవ్ లో నిలవాలని.. తమ శక్తి మేరకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కొంత మందికి గాయాలు అయి.. మెడికల్ రూమ్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. పరిస్థితి ఇలా ఉంటే హౌస్ నుండి “టికెట్ టూ ఫినాలే” కోసం పోటీ పడ్డ ఏడుగురిలో షణ్ముక్(Shanmuk), కాజల్(Kajal),పింకీ(Pinky).. ఓడిపోవడం జరిగింది. దీంతో.. ఈ టాస్క్ లో సన్నీ(Sunny), మానస్(Manas), శ్రీరామ్(Sri Ram), సిరి(Siri).. మాత్రం మిగిలి ఉన్నారు. వీరిలో దాదాపు సిరి లేదా మానస్ గెలిచినట్లు బయట వార్తలు వస్తున్నాయి.
శుక్రవారం జరగబోయే ఎపిసోడ్ లో దాదాపు.. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కానున్నట్లు అది సన్నీ.. శ్రీరామ్ అన్నట్టు టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో… ఈ టాస్క్ లో గెలిస్తే నిజంగా అది మ్యాజిక్ అవుతుందని పూర్తిగా గేమ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని చెప్పుకొస్తున్నారు. కాగా మిగిలి ఉన్న ఇంకా టాస్క్ లు… చాలా ఉత్కంఠభరితంగా కంటెస్టెంట్ లు ఫోకస్ .. తెలివితేటలకు సంబంధించి.. గేమ్ జరగనున్నట్లు తెలుస్తోంది.
మొత్తంమీద చూసుకుంటే ఈ కీలకమైన టాస్క్ లో… పింకీ షణ్ముక్ కాజల్.. ఎలిమినేట్ అయినట్లు.. సన్నీ, సిరి, మానస్, శ్రీరామ్ మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో లీక్ వీరులు నుండి అందుతున్న సమాచారం ప్రకారం మానస్ లేదా సిరి గెలిచే అవకాశాలు ఉన్నట్లు టాక్. ఏది ఏమైనా శుక్రవారం శనివారం ఎపిసోడ్ లలో.. ఈ టాస్క్ లో భాగంగా.. బిగ్ బాస్(Bigg Boss) మిగిలిన నలుగురిని.. ఏ విధంగా ఆడిస్తాడు అనేది చూడటానికి ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.