తెలుగుదేశం పోత్తుతో కాంగ్రెస్‌కు నష్టం

72 views

హైదరాబాద్, జనవరి 5: తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణాలో  టీడీపీ కేడర్ నామ మాత్రంగానే ఉందన్నారు.  పొత్తు కారణంగా  ఉద్యోగులు, యువత పార్టీకి దూరం అయ్యారన్నారు. కనీసం 45 సీట్లు గెలుస్తుందని  ఊహించామన్నారు. కనీసం 45 సీట్లు గెలుస్తుందని ఊహించామన్నరు.

పోత్తులు వద్దని ముందే  చెప్పాననీ, మహాకూటమి గెలిస్తే తెలంగాణాలో ఏపీ సిఎం చంద్రబాబు  ప్రాధాన్యత  పెరుగుతుందని తెలంగాణా రాష్ట్రసమితి నేతలు ప్రచారం చేశారని చెప్పారు. టిఆర్‌ఎస్ నేతల మాటలను ప్రజలు నమ్మారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నల్లొండ నుంచి ఎంపీ గా పోటీచేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు వద్దని పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు పేర్కొన్నారు.  పొత్తులు లేకుండా తెలంగాణాలో  ఏడు పార్లమెంట్ స్ధానాలను  కాంగ్రెస్ పార్టీ  గెలుస్తుందన్నారు.

ఇటీవల జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,టీడీపీతో కలసి పోటీ చేసి అధికారం చేజార్చుకుంది.