Tik Tok Durga Rao: టిక్ టాక్ దుర్గ రావు బిగ్ బాస్ ఎంట్రీ లేటెస్ట్ వైరల్ న్యూస్..!!

Share

Tik Tok Durga Rao: సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీ అయిన వారిలో టిక్ టాక్ దుర్గారావు ఒకరు. భార్యతో కలసి పాత పాటలకు అదే రీతిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాలకు సంబంధించిన డైలాగులు చెబుతూ బాగా పాపులర్ అయ్యారు. పాత కాలం మాదిరి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తరహాలో దుర్గారావు… అతని భార్య వేసే స్టెప్పులు టెలివిజన్ రంగంలో.. పాపులర్ షోలు.. ఢీ… జబర్దస్త్ వంటి చోట్ల కూడా కంటెస్టెంట్ లు వేసి టెలివిజన్ ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఆ తర్వాత దుర్గారావు క్రేజ్ మరింతగా పెరగటంతో.. టెలివిజన్ రంగంలో షోలలో.. వచ్చి పెర్ఫామెన్స్ ఇవ్వటం జరిగింది. సుడిగాలి సుదీర్, హైపర్ ఆది… గెటప్ శీను.. వారి అండతో మరింతగా ఎంటర్టైన్మెంట్ రంగానికి దుర్గాప్రసాద్ దగ్గరయ్యారు.

TikTok star Durga Rao in Bigg Boss 5 Telugu house? - tollywood

ప్రస్తుతం టిక్ టాక్ లేకపోవడంతో.. ఇంస్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో.. దుర్గారావు ని తీసుకున్నట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి సంబంధించి ప్రోమో ఇటీవల రిలీజ్ అవ్వడం జరిగింది. ఆగస్టు ఒకటవ తారీకు… షో ప్రోమో.. రిలీజ్ చేసి.. నాగార్జున మళ్లీ హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ మాసం నుండి షో స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దుర్గారావు జంట హైదరాబాద్ నగరంలోనే ఉండటం సంచలనంగా మారింది. ఇటీవల దుర్గారావు ఓ ప్రవేట్ వెబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా తాను గాని లేకపోతే తన భార్య గాని… ఇద్దరూ బిగ్ బాస్ షో లోకి వెళ్ళే అవకాశం ఉందని… ఆల్రెడీ తమతో కొంతమంది సంప్రదిస్తున్నట్లు దుర్గారావు చెప్పుకొచ్చారు.

 

మొదటిలో భార్యని విడిచి.. వెళ్ళడానికి కొంచెం టైం పట్టిందని ప్రజెంట్ మాత్రం అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాను అని గత కొన్ని రోజుల క్రితం తెలపడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దుర్గారావు జంట హైదరాబాద్ లోనే ఉండటంతో చాలావరకు దుర్గారావు… బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి సెలక్ట్ అయినట్లు చాలామంది చెప్పుకొస్తున్నారు. గతంలో గంగవ్వ.. మాదిరిగా దుర్గారావు నీ హౌస్లో తీసుకురావటానికి షో నిర్వాహకులు రెడీ అవుతున్నట్లు టాక్. ఎంటర్టైన్మెంట్ పరంగా డాన్స్ పరంగా ఇంకా అనేక రీతులుగా.. దుర్గారావు బిగ్ బాస్ రియాల్టీ షోకి కరెక్ట్ అని తాజా వార్త పై సోషల్ మీడియాలో నెటిజనులు అంటున్నారు. కచ్చితంగా దుర్గారావు హౌస్ లో అడుగు పెడితే టాప్ ఫైవ్ లో కి వెళ్ళటం గ్యారెంటీ అని.. కల్లాకపటం లేని వ్యక్తి పైగా కల్మషం లేని వ్యక్తి తో పాటు.. అన్ని రకాలుగా బిగ్ బాస్ ఆడియన్స్ నీ ఆకట్టుకునే రీతిలో.. సరైన కంటెస్టెంట్ అని.. కచ్చితంగా ఓట్లు రికార్డు స్థాయిలో పడతాయని.. దుర్గారావు షోకే హైలెట్ అవుతాడని… బిగ్బాస్ ఆడియన్స్ అంటున్నారు. సోలో పెర్ఫార్మెన్స్ పరంగా దుర్గారావు వ్యవహరిస్తే… మిగతా సెలబ్రిటీల కంటే దుర్గారావు కి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా షోలో దుర్గారావు అడుగుపెడితే ఈసారి సీజన్ మరింత రసవత్తరంగా ఉంటుందని.. విశ్లేషణలు వస్తున్నాయి.


Share

Related posts

ఆంధ్రకు ఐదున్నరవేల కోట్లు ఇచ్చాం : అమిత్‌షా

somaraju sharma

చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోండి !!

Kumar

పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ల‌తో బాలీవుడ్ న‌టుల‌కు సంబంధాలు..?

Srikanth A