Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అతడికే తన సపోర్ట్ చెప్పేసిన టిక్ టాక్ దుర్గారావు..!!

Share

Bigg Boss 5 Telugu: సోషల్ మీడియా పుణ్యమా చాలామంది తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. సోషల్ మీడియా పుణ్యమా చాలామంది ఓవర్ నైట్ లో సెలబ్రిటీగా మారిన వాళ్ళు ఉన్నారు. ఊహించని విధంగా గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటూ టెలివిజన్ రంగంలో కూడా అటువంటివారు రాణిస్తున్నారు. ఈ కోవకు చెందిన వాడు టిక్ టాక్ దుర్గారావు. దేశంలో టిక్ టాక్ బ్యాన్ కాక ముందు తన వీడియోలతో సరికొత్తగా… ఇటువంటి బెరుకు లేకుండా చేస్తూ తనలో ఉన్న టాలెంట్ బయటపెట్టి.. మంచి గుర్తింపు పొందాడు.

అప్పట్లో లాక్డౌన్ సమయంలో.. టిక్టాక్ దుర్గారావు వీడియోలు.. హైలెట్. RRR సినిమాకి సంబంధించి రామ్ చరణ్ లుక్ వీడియో తో మరీ గుర్తింపు పొందాడు. ఇక ఇంటిలో భార్యతో కలిసి అలనాటి పాటలకు వేయడంతోపాటు వెనకాల దుప్పటి కట్టి వెరైటీగా రికార్డింగ్ డాన్స్ మాదిరిగా.. స్టెప్పులు వేస్తూ వీడియోలు చేస్తూ.. నెటిజన్లను ఎంతగానో అలరించే వాడు.  ఈ క్రమంలోనే తన భార్యతో కలసి చేసిన ‘నాది నెక్కిలీసు గొలుసు’ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ కావడంతో ఒక్కరోజులోనే ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు.

TV anchor Ravi files case against distributor- The New Indian Express

దీంతో తరచూ భార్యతో కలిసి డ్యాన్సులు చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత.. టెలివిజన్ రంగంలో అనేక పేరుగాంచిన షోలలో అవకాశాలు వచ్చాయి. ఎక్కడో పల్లెటూర్లో ఉండే దుర్గారావు దగ్గరకు హైదరాబాదులో ఉండే చాలా మంది సెలబ్రెటీలు స్పెషల్ కారు పంపించి సతీసమేతంగా వారిని తమ షోలలో పెట్టుకుని వారికి అవకాశాలు కల్పించి.. సినిమా ఇండస్ట్రీలో కూడా ఎదిగేలా చేయడం జరిగింది. టిక్టాక్ దుర్గారావు.. ఒకపక్క ఇంటికాడ వ్యవసాయం చేస్తూనే మరో పక్క సినిమారంగంలో రాణిస్తూ బుల్లితెర పై కూడా తన టాలెంట్ చూపిస్తూ ఉన్నాడు. దీంతో బిగ్బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభం కాకముందు దుర్గారావు కూడా హౌస్ లోకి అడుగుపెడుతున్న టు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అంత మాత్రమే కాక తాను కూడా హౌస్ లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు… అవకాశం వస్తే వదులుకోను అని చెప్పుకొచ్చాడు. కానీ తీరా.. సీజన్ ఫైవ్ ప్రారంభమయ్యాక… దుర్గారావు ఎక్కడా కూడా కనిపించలేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలా వరకు బయట ఉన్న సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లో… ఒక నచ్చిన కంటెస్టెంట్ లకు మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల టిక్ టాక్ దుర్గారావు బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ…’యాంకర్‌ రవి కోసమే బిగ్‌బాస్‌ చూస్తున్నాను. ఆయన నవ్వు, అందం.. అచ్చం మహేశ్‌బాబులానే ఉంటారు. నేను మహేశ్‌బాబు అభిమానిని. రవిని చూస్తుంటే మహేశ్‌బాబుగారే గుర్తొస్తారు. నా ఫుల్‌ సపోర్ట్‌ రవిగారికే! ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే అతడంటే నాకు, నా భార్యకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చాడు.  ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు… తన సపోర్ట్ ప్రియాంక సింగ్ కి.. అని ప్రకటించటం జరిగింది. ఆమె గెలిచిన గెలవకపోయినా జీవితంలో అనేక ఇబ్బందులు పడటం జరిగిందని కాకపోతే ప్రియాంక సింగ్ గెలిస్తే ఆనందంగా ఉంటుందని నాగబాబు తెలిపారు.

ఇక ఇదే తరుణంలో కుర్ర హీరో తనీష్.. బిగ్ బాస్ హౌస్ లో తన సపోర్ట్ మానస్ కి అని ప్రకటించటం జరిగింది. ఐదో సీజన్‌లో తన క్లోజ్‌ ఫ్రెండ్‌ మానస్‌ ఉన్నాడని, అతడు చాలా మంచి మనిషని చెప్పుకొచ్చాడు. అతడు తప్పకుండా టాప్‌ 5లో అడుగు పెడతాడని… జోస్యం చెప్పారు. అంత మాత్రమే కాక నోయెల్.. తన ఫుల్ సపోర్ట్ తన ఫ్రెండ్ శ్రీ రామ్ చంద్ర కి అని తెలియజేశాడు. దీంతో ఈసారి.. బిగ్ బాస్ హౌస్ లో.. చాలామంది కంటెస్టెంట్ లకు ముందుగానే బయట ఉండే ప్రముఖులు మద్దతు తెలపడంతో ఓటింగ్.. అనేది ఇప్పుడు కీలకంగా మారింది. సాధారణంగా షో చివరికి వచ్చేసరికి హౌస్ లో మిగిలి ఉండే సభ్యులకు.. బయట సెలబ్రిటీలు మద్దతు తెలుపుతారు. కానీ సీజన్ ఫైవ్ కి ముందుగానే.. సపోర్ట్ చేస్తూ ఉండటం విశేషం.


Share

Related posts

Irregular Periods: నెలసరి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇవి తినండి!!

Kumar

BREAKING: ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న మహేష్.. ఇక రచ్చ మామూలుగా ఉండదు!

amrutha

రాజధాని విషయంలో హైకోర్టు రివర్స్ గేర్..! ఎక్కడ మొదలెట్టాడో అక్కడే ఆగిన జగన్

arun kanna