Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ Sridevi Drama Company అనే కామెడీ షో ఇటీవలే ఈటీవీలో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈషో బాగానే నడుస్తోంది. తెలుగులో సరికొత్త కామెడీని అందించేందుకు వచ్చిందే ఈ షో.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త కామెడీని అందిస్తూ.. ప్రస్తుతం టీఆర్పీలో ఈ షో దూసుకుపోతోంది. ఈ షోలో డ్యాన్స్ షోలు, స్పెషల్ గెస్టులు, జబర్దస్త్ కమెడియన్లు.. అంతా కలిసి చేసే హడావుడి మామూలుగా ఉండదు. ప్రతి వారం ఏదో ఒక కొత్త థీమ్ ను తీసుకొని దాని మీద కామెడీని జనరేట్ చేయడమే ఈ షో ఉద్దేశం.
ఈ షోలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష యాంకర్లుగా వ్యవహరిస్తూ.. కామెడీని కూడా సూపర్ గా పండిస్తున్నారు. అయితే.. వచ్చే వారం ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా టిక్ టాక్ భాను వచ్చింది. సీనియర్ నటి హేమతో పాటు.. టిక్ టాక్ భాను వచ్చి షోలో సందడి చేశారు.
Sridevi Drama Company : వర్షను పక్కన పెట్టుకొని భానుకు లైన్ వేసిన ఇమ్మాన్యుయేల్
భాను ఎప్పుడైతే షోకు వచ్చిందో.. ఇక చూసుకోండి… ఇమ్మాన్యుయేల్.. వర్షను పక్కన పెట్టుకొని భానుకు లైన్ వేయడం ప్రారంభించాడు. భాను ముందు షోఅప్ చేశాడు.
ఈ షోలో హేమ.. భాను తల్లిగా నటించింది. భానుకు పెళ్లి చూపులు నిర్వహించి.. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లతో కామెడీని జనరేట్ చేసి ప్రేక్షకులను బాగానే నవ్వించారు.
తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోను చూసేయండి.