టిక్ టాక్ దుర్గారావు గురించి సోషల్ మీడియా మీద పట్టున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. వైవిధ్యమైన స్టెప్పులతో పాటలు పాడుతూ.. టిక్ టాక్ లో ఎంతో ఎంటర్ టైన్ మెంట్ అందించాడు టిక్ టాక్ దుర్గారావు. ఆయన భార్య, ఆయన కలిసి వేసిన డ్యాన్సులు, పాడిన పాటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. దీంతో వీళ్లు ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు.
దుర్గారావు నాట్య మండలి పేరుతో వీళ్లు టిక్ టాక్ లో అకౌంట్ తెరిచి కొన్ని వందల వీడియోలు చేశారు. చాలా ఫేమస్ అయ్యారు. ఒక్క దెబ్బతో సెలబ్రిటీలు అయ్యారు. టిక్ టాక్ లో లక్షల మంది ఫాలోయర్స్ ను సంపాదించుకున్నారు.
టిక్ టాక్ బ్యాన్ అయినప్పటికీ.. వీళ్లు మాత్రం తమ వీడియోలను ఆపలేదు. ఇఫ్పుడు యూట్యూబ్, ఫేస్ బుక్ ను ఉపయోగించుకొని వీడియోలు చేస్తున్నారు. తమ ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచుతున్నారు.
నాది నక్కిలీసు గొలుసు అనే పాటకు దుర్గారావు వేసిన స్టెప్స్ చాలా ఫేమస్ అయ్యాయి. ఈటీవీ ఢీ షోలో కూడా దుర్గారావు పేరుతో డ్యాన్స్ కూడా వేశారు.
వీళ్లు ఇంత ఫేమస్ అయ్యాక ఎవరు ఊరుకుంటారు. వీళ్లను జబర్దస్త్, అదిరింది షోలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరిగాయి. అదిరింది షో లో కూడా దుర్గారావు మెరిశారు.
అలాగే జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ లో దుర్గారావు దంపతులు మెరిశారు. అయితే.. ఆ స్కిట్ లో హైపర్ ఆది వాళ్లకు ఎంతో కొంత స్కోప్ ఇచ్చి ఉంటారులే అని అందరూ అనుకున్నారు. కానీ.. ఆ స్కిట్ లో దుర్గారావు దంపతులను కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఉంచి అక్కడి నుంచి పంపించేశారు.
వాళ్ల ఫేమస్ స్టెప్పు నాది నక్కిలీసు గొలుసు పాటకు మాత్రం డ్యాన్స్ వేయించి.. రెండు పంచులు వేసి ఆది వాళ్లను అక్కడినుంచి పంపించేశారు. దుర్గారావుకు కనీసం ఒక్క డైలాగ్ కూడా ఇవ్వకుండా.. వెంటనే స్టేజీ మీది నుంచి పంపించేయడం దుర్గారావు ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేసిందట. కేవలం తన స్కిట్ కు హైప్ పెంచుకోవడం కోసం హైపర్ ఆది ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ప్లే చేశాడంటూ దుర్గారావు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అయితే… దుర్గారావు కనిపించింది కొన్ని సెకన్లే అయినా.. ఆయన కనిపించినంత సేపు ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యారని.. సెట్ లో ఉన్నవాళ్లు కూడా కడుపుబ్బా నవ్వుకున్నారని.. దుర్గారావు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దుర్గారావును టీమ్ లీడర్ గా తీసుకొని… సపరేట్ టీమ్ సెటప్ చేసి జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే చాన్స్ ఆయనకు ఇవ్వాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
దుర్గారావు జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్ లో కనిపించిన వీడియో ఇదే..
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!