Times Indu Jain: మహమ్మారి కాటుతో దేశంలోని మీడియాధిపతి.., కుబేర వనిత కన్నుమూత..!

Times Indu Jain: Death story of Richest Person
Share

Times Indu Jain: మహమ్మారి కారణంగా చిన్నా, పెద్ద… పేద ధనికా.., తేడా లేకుండా మరణాలు జరుగుతున్నాయి.. ఇన్నాళ్లు మీడియాల్లో పనిచేసే సిబ్బంది, జర్నలిస్టులు మాత్రమే కన్నుమూశారని వార్తలు విన్నాము, చూసాము, రాసాము. ఈరోజు ఓ మీడియా దిగ్గజం మరణించారు. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థ “టైమ్స్ గ్రూప్” చైర్ పర్సన్ ఇహ్డూ జైన్ కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. కానీ ఇన్నాళ్లు చురుకుగానే ఉండేవారు. మహమ్మారి సోకడం వల్ల ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి.

Times Indu Jain: Death story of Richest Person
Times Indu Jain: Death story of Richest Person

Times Indu Jain:  టైమ్స్ తో రూపురేఖలు మార్చారు..!!

దేశంలో మీడియా సంస్థలు అంటే మొదట గుర్తొచ్చేది హిందూ, టైమ్స్ అఫ్ ఇండియా, దైనిక్ భాస్కర్ తదితర సంస్థలు. వీటిలో టైమ్స్ పుట్టుకే ఒక చరిత్ర. దాదాపు 182 ఏళ్ళ కిందట అంటే 1838 లో ఈ టైమ్స్ అఫ్ ఇండియా ప్రారంభం అయింది. సాహు జైన్ ప్రారంభించగా… ఆయన నుండి కుమారుడు అశోక్ కుమార్ జైన్ తీసుకున్నారు. 1999 లో ఈయన మరణానంతరం ఇందూ జైన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇందూ జైన్ 1936 సెప్టెంబర్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జన్మించారు. అశోక్ కుమార్ జైన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి సమీర్ జైన్, వినీత్ జైన్ సంతానం.

Times Indu Jain: Death story of Richest Person
Times Indu Jain: Death story of Richest Person

ఫౌండేషన్ తో సేవలు..!!

టైమ్స్ సంస్థ ద్వారానే టైమ్స్ ఫౌండేషన్‌ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వరదలు, తుపానులు, భూకంపాల వంటి విపత్తుల సమయంలో ఎంతోమందికి సాయం అందించారు.దేశ పారిశ్రామిక రంగానికి ఇందూ జైన్ చేసిన సేవలకు గాను ఆమెను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2015లో 3.1 బిలియన్ డాలర్ల సంపదతో ఇందూ జైన్ ఫోర్స్బ్‌ ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించారు.తద్వారా భారత్‌లోని కుబేరుల్లో 57వ స్థానంలో, ప్రపంచంలో 549వ స్థానంలో నిలిచారు.


Share

Related posts

బెదిరింపులపై మోహన్ బాబు ఫిర్యాదు

sarath

కత్రినా కోరిక ఏమిటో తెలుసా?

somaraju sharma

పెళ్లి అయిన హీరోయిన్ లలో సమంత ని డామినేట్ చేస్తోన్న తోపులాంటి అందగత్తె

Naina