న్యూస్ హెల్త్

వ్యాపారాభివృధి కలగాలన్న, ఆర్ధిక సమస్యలు పోవాలన్నా ఇలా చేసిచూడండి!!

వ్యాపారాభివృధి కలగాలన్న, ఆర్ధిక సమస్యలు పోవాలన్నా ఇలా చేసిచూడండి!!
Share

వ్యాపారాభివృధి జరగాలంటే  తాళ్ల పాత్ర నిధిలో  తెలుపబడిన  కొన్ని విషయాలను మన పెద్దలు  మనకు  తెలియచేసారు. అవి ఏంటో తెలుసుకుందాం.. డబ్బులు పెట్టె  క్రింద నల్ల గురి గింజలు ఉంచటం వలన వ్యాపారం మైన లేదా పరిశ్రమ అయినా వృద్ధిలోకి వస్తుంది.

వ్యాపారాభివృధి కలగాలన్న, ఆర్ధిక సమస్యలు పోవాలన్నా ఇలా చేసిచూడండి!!

ఒక తెల్లని వస్త్రం జెండా గా చేసి రావిచెట్టు పైన ఎగరవేయడం వలన వ్యాపారం వృద్ది అగును.
ఏదైనా వ్యాపారానికి సంబందించిన పని మీద బయటకి వెళ్లే ముందు కొన్ని డబ్బులు విడిగా తీసి ఒకచోట ఉంచాలి. పని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చాక ఆ డబ్బుని  ఒక పేదవాని భోజనానికివినియోగించాలి. ఎప్పుడు ఏ పనిమీద  బయటకి వెళ్లినా ఈ ఉపాయం పాటిస్తే ఆదాయం నిరంతరం వృద్దిచెందడం  తో పాటుపేదలకు ఆహారం దొరుకుతుంది.  భాగస్వామితో కలిసి వ్యాపారం చేసేవారు మంగళవారం నాడు కానీ  శనివారం కాని పని ప్రారంభించడం అస్సలు మంచిది కాదు. అలాగే భాగస్వామిపత్రం పైన గురువారం పసుపు నీటి చుక్కలుచిలకరించడం వలన భాగస్వామ్యం సఫలమై వ్యాపారం చిరకాలం వృద్ధి లో నడుస్తుంది.

ఆర్ధికసమస్యలు తీరడం  కొరకు ఉదయం నిద్రలేవగానే ధ్యాన పూర్వకంగా అరచేతులు చూసుకుని మూడుసార్లు ముద్దు పెట్టుకోవాలి. తరువాత పళ్ళుతోముకోవాలి . చీమలకు ఆహారం గా పిండి చక్కర , బూందీ వంటివి వేయాలి. ఈ ప్రయోగాలు తిరుగులేనివి. ఇవి చేస్తే ఆర్ధిక  సమస్యలు తీరి సుఖసమృద్ధి తో ఉంటారు.

జీవితంలో స్థిరం గా సుఖం గా ఉండాలంటే  రావిచెట్టు కింద నిలబడి ఇనుపపాత్రలో నింపిననీటిని పొయ్యాలి. ఆ నీటి లో కొంచం చక్కర , నెయ్యి , పాలు కలపాలి. జీవితంలో కల్లోలం , సంఘర్షణ ఎక్కువుగా ఉంటే ఈ ప్రయోగం శనివారం నాడు చేయండి . ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత రావిచెట్టుకు నీటిని పోయడం  అలవాటు గా చేసుకుంటే మంచి అనుకూల స్థితి వస్తుంది. దాన్ని చూసి మీరే ఆశ్చర్య పోతారు.

ఈ  తాంత్రిక ప్రయోగాలను పురాతన గ్రంథాల నుంచి సేకరించి  మన పెద్దలు మనకు అందించారు . ఒకటి రెండుసార్లు చేసి ఈ ప్రయోగాలతో  ఫలితం రాలేదని వదిలేయవద్దు. పట్టువిడువకుండా  అలా  చేస్తూనే ఉంటే నిమ్మనెమ్మదిగా  జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులువచ్చి మంచి వృద్ది కలుగుతుంది.


Share

Related posts

సానా సతీష్ బాబు అరెస్టు!

Siva Prasad

Big Breaking: ఏపి సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ..! ఎందుకంటే..?

somaraju sharma

Huzurabad: హుజురాబాద్ ఉప ఎన్నిక‌… ఇప్ప‌ట్లో లేన‌ట్లే

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar