చదువు పూర్తి చేసి సర్టిఫికెట్ లు చేతికి రాగానే ప్రతి ఒక్కరు ఉద్యోగం వెతుక్కోవడం లో బిజీ అయిపోతారు. ఒక వ్యక్తి ఉద్యోగం చేయాలి అంటే తమ గురించి ఉద్యోగం ఇచ్చే అధికారులకు తెలియజేయాలి. అందుకోసం ముందు ప్రాధాన్యత ఇవ్వవలిసింది రెజ్యూమ్‌కే. వాటిని చూసే కంపెనీలు నిరుద్యోగులకు అవకాశాలు ఇస్తారు. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయంలో మాత్రం చాలా మందికి సరైన అవగాహన ఉండదు.. రెస్యూమ్ బాగా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ టిప్స్‌ని పాటించండి..
- మన గురించి తెలియజేసే రెజ్యూమ్ స్పష్టంగా, సంక్షిప్తంగా, చూడగానే ఆకట్టుకునేలా ఉండాలి. మనలో ఉన్న ప్రత్యేకమైన టేలెంట్ వారికి తెలియచేయడానికి బోల్డ్ లెటర్స్‌లో పెట్టడం మంచిది.
- షార్ట్ అండ్ స్వీట్‌గా ఇంతకుముందు ఉన్న అనుభవాన్ని, సాధించిన విజయాల్ని తెలియజేయాలి.
- మన క్వాలిఫికేషన్, క్వాలిటీస్‌ని కూడా అందులోపెట్టాలి.
- చివరగా మన పర్సనల్ ప్రొఫైల్ ను కూడా పెట్టాలి.
అయితే, మన గురించి మొత్తం చెప్పాలి అన్న భావన తో తమ గురించి మొత్తం విషయాలు నాలుగైదు పేజీలు గా నింపేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు.. తక్కువ పదాల తో మీ గురించి వివరంగా తెలియ చేయాలి .
మనం ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన నాలెడ్జ్ గురించి మాత్రమే తెలపాలి. అనవసరమైన విషయాల జోలికి పోకూడదు.
ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు ప్రముఖ కంపెనీల్లో పనిచేసిన అనుభవం గురించి మాత్రమే వివరించాలి. చిన్నచిన్న ఉద్యోగాలు చేసినట్లైతే వాటి గురించి ప్రస్తావించకపోవడం ఉత్తమం.కొంతమంది హాబీస్ అనగానే.. పాటలు వినడం, ఆటలు ఆడడం అని సంబంధం లేకుండా చెప్పేస్తుంటారు . ఇవి ఎంప్లాయిర్స్‌కి ఎంతవరకూ అవసరమో ఆలోచించాలి .
హాబీస్ విషయంలో పేపర్ చదవడం, న్యూస్ చూడడం వంటివి పెడితే బాగుంటుంది.
చాలా కంపెనీస్ శాలరీస్ విషయం గోప్యంగా ఉంచుతాయి.కాబట్టి… ఆ ప్రస్తావన తీసుకు రాకుండా ఉండడం మంచిది.