Postpartum :మగ వారిని బాగా ఆకర్షించడంలో అందం ప్రాముఖ్యత చాలానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే డెలివరి జరిగిన తర్వాతస్త్రీల ల అందం తగులుతుందని మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పొట్ట ప్రాంతం లో బాగా పెద్ద చారలు కనిపించే అవకాశం ఉంది. దీం తో చాలా మంది ఆడ వారికి ఒక రకమైన అభద్రతా భావం కలుగుతుంది . ఇలా మచ్చలు లేదా పెద్ద పెద్ద చారలు రావడం వల్ల భర్త తమను దూరం గా ఉంచు తారనే అభిప్రాయం స్త్రీలలో కలుగుతుంది . అయితే, పురుషు లకి తమ బాగస్వామి ప్రసవం తర్వాత వచ్చిన మార్పులు మీద ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో కొందరిని అడుగగా వారు చెప్పిన ఆశక్తి కర విషయాలు తెలుసుకుందాము.
చాలా మంది మగ వారు తమను అర్థం చేసుకొనే అమ్మాయి వస్తే చాలని అనుకుంటారు. వ్యక్తిత్వం బాగుంటే తన అందాన్ని నేను అసలు పట్టించుకోను అని ఒక భర్త తెలిపారు. డెలివరి తర్వాత నా భార్యకు వీపు కింద భాగం లో చాల పెద్ద మొత్తం లో మార్క్స్ ఏర్పడ్డాయి. చాలా మంది మగ వారికి అలా ఉంటే నచ్చదు. కానీ నేను మాత్రం ఆమెను ఇప్పుడు మరింత ఇష్టపడుతున్నా…ఎందుకంటే ఆమె ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు మరింత జెన్యూన్‌గా ఉంది. అని కొత్తగా తండ్రి అయిన వ్యక్తి తెలియచేసారు.
ప్రసవ చారలు ఒక్కోక్కరు ఒక్కోవిధంగా బావిస్తారు. ఒక భర్త దాని గురించి మాట్లాడుతూ, మాకు పుట్టిన పాప వల్ల ఆ చారలు వచ్చాయి. ఆ చారల ను నేను పులి చారలు గా బావిస్తాను. దీంతో ఆమె మీద నాకు ప్రేమ మరింత ఎక్కువ కలుగుతోంది.
సాధారణంగా, ఒక వ్యక్తి మనల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాక వారి అందాన్ని మనం లెక్కలోకి తీసుకోము. మాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన పొట్ట భాగం లో ఎక్కువగా ప్రగ్నెన్సీ మార్క్స్ ఏర్పడ్డాయి. వీటినిచూసుకుని తను రోజూ బాధపడే ది అయితే నేను నా భార్యకు ఒక్కటే చెప్పే వాడిని, నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు, నిజం చెప్పాలంటే నువ్వు ముందు లాగానే అందం గా ఉన్నావు అని తనకు తెలియ చేశాను అని ఒక భర్త తన అభిప్రాయం తెలియ చేసారు. ఆ చారలు మాతృత్వానికి చిహ్నాలు అవిలేక చాలామంది మానసిక వ్యదకి గురిఅవుతున్నారు. కాబట్టి ఉన్నవారు వాటి గురించి అలోచించి మనస్సు పాడు చేసుకోకండి.