Anger మీకు ప్రతిదానికి కోపం వస్తుందా ?అయితే ఇలా చేసి చూడండి!!(పార్ట్ -2)

Tips on How to Control Anger Part-2
Share

Anger: కోపాన్ని అదుపు చేసుకునేందుకు….దీర్ఘశ్వాస క్రియలను అలవాటు చేసుకోండి. మీరు ఎవరి పైన అయినా లేదా ఏదైనా సందర్భంలో అయినా పట్టలేనంత కోపం వస్తే గట్టిగా గాలి పీల్చి, నెమ్మదిగా బయటకు వదలండి, ఇలా కొన్ని సార్లు చేయడం వలన శ్వాసక్రియ వెంటనే ఒత్తిడిని తగ్గించి కండరాలకు విశ్రాంతి ని ఇచ్చి కోపం తగ్గేలా సహాయపడుతుంది.

Tips on How to Control Anger Part-2
Tips on How to Control Anger Part-2

రోజుకు కనీసం కచ్చితం గా 8 గంటలపాటు నిద్రపోయి తీరాలి. మీరు రాత్రి సమయంలో ప్రశాంతం గా నిద్రపోవడం చాల అవసరం. సరిపడినంత నిద్ర లేకపోవడం వలన కూడా విశ్రాంతి లేనట్లు చిరాకుగా అనిపిస్తుంది.మీకు అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండే అలవాటు ఉన్నట్లయితే..మీరు అస్తమాను కోపం గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు గాని రోజూ డ్రింక్ చేసే అలవాటు గాని ఉంటే దానిని వెంటనే ఆపండి. తరచూ మాదక ద్రవ్య వాడకం మరియు మద్యపానం వలన పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ప్రతి రోజు 20 నిమిషాలపాటు ధ్యానం చేయడం వలన మీ మనస్సుకు చక్కని ప్రశాంతత లభిస్తుంది. మరియు వ్యక్తుల పై ఉన్న కోపం , కక్ష తగ్గిపోతుంది.ధ్యానం వలన మనలో కలిగే అన్ని భావాలు మరియు ఉద్రేకాలను తెలుసుకోవచ్చు. దీనివలన మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వస్తుంది.

కొన్నిసార్లు మన లో కలిగే భావాలను ఒకచోట వ్రాయడం వలన కూడా పరిస్థితిని అదుపు చేసుకోగలుగుతారు. కొంత సమయం తర్వాత,వాటిని చదివితే ఇటువంటి చిన్న చిన్న సమస్యలకు కోపంగా ప్రవర్తించడం సరయినది కాదు అని అనిపిస్తుంది. అశాంతితో ఉండే మెదడు ను దారికి తెచ్చుకోవడం కొంచెం కష్టమైన పని అయినప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకుని, ఆమోదించడం వలన మీరు కోపానికి గల కారణాన్ని అర్థం గలిగి ఆ పరిస్థితిని సమర్థవంతంగా మీకు అనుగుణం గా మార్చుకో గలుగుతారు.


Share

Related posts

వృద్ధులకు వ్యాయామం మరింత మంచిది!

Siva Prasad

వైఎస్ భారతిని ఇన్ వాల్వ్ చేస్తూ ఏపీలో పెద్ద స్కామ్ బయటపెట్టిన టీడీపీ??

CMR

Konda Visveswar Reddy : తెలంగాణలో మరో కొత్త పార్టీ రానున్నదా.. ! ఈ తాజా మాజీ కాంగ్రెస్ నేత రూట్ ఎటంటే..?

somaraju sharma