EMI: కరోనా కష్టకాలంలో దేశంలో చాలా మంది రుణాలు సకాలంలో చెల్లించలేక అప్పుల బారిన పడిన సంఘటనలు మనం చూశాం. ఈ క్రమంలో ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడిన సంగతులు కూడా వున్నాయి. ఇకపోతే అత్యవసరమైనపుడు ఎవరన్నా డబ్బుని సేకరించడానికి వివిధ మార్గాలను అనుసరిస్తారు. అందులో ఒకటి EMI విధానం ద్వారా బ్యాంకులలో అప్పుని పొందటం. అయితే ఇలాంటి రుణం తీసుకున్నవారు ముఖ్యంగా కొన్ని విషయాలను గమనించాలి. అలాంటివారి కోసం ICICI బ్యాంక్ మీకు కొన్ని ప్రత్యేక చిట్కాలను అందిస్తోంది.
RRR: కౌంట్‌డౌన్ స్టార్ట్..’రామ్ – భీమ్’ల కొత్త పోస్టర్ వదిలిన జక్కన్న టీమ్..
EMI: ICICI EMI ఐడియాలు ఇవే..
ఏదైనా లోన్ ముఖ్యంగా పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్‌పై ఎక్కువ వడ్డీ రేట్లు కలిగినటువంటి రుణం తీసుకునే ముందు, అప్లై చేయడానికి ముందే రీపేమెంట్ కోసం ప్లాన్ చేస్తే మంచింది. EMI తేదీ మీ జీతం గడువు తేదీకి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మన ఖాతాలో కొంత అదనపు EMI బ్యాలెన్స్‌ను మెంటైన్ చేయాలి. అందువలన మనం పెనాల్టీని అరికట్టవచ్చు. ఇకపోతే ఏదైనా ఒక EMI చెల్లించడంలో తరచుగా జాప్యం చేయడం కనిపించినట్లయితే వేర్వేరు క్రెడిట్ కార్డ్‌లలో వేరు వేరుగా EMIలను చెల్లిస్తున్నట్లయితే, వ్యక్తిగత రుణం తీసుకొని వాటన్నింటినీ చెల్లించడం ఉత్తమం.
Tingling sensation: కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా..!? నీళ్లలో ఇది వేసుకుని తాగండి..
ఇంకా ఇలా చేస్తే మంచిది..!
మనం రుణం తీసుకున్న తర్వాత దాన్ని నిరంతరం సమీక్షిస్తూ వుండటం చాలా ముఖ్యమైన అంశం. మార్కెట్లో వస్తున్న ఆఫర్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఈ క్రమంలో మనపై భారాన్ని తగ్గించే ఏదైనా ఓ మంచి ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం అన్నింటికన్నా మంచిది. మన రుణం EMI రూపంలో కొనసాగుతూ వున్నపుడు, సరిగ్గా అదే సమయంలో వేరే చోట నుంచి ఆదాయం వస్తున్నట్టయితే దీని సహాయంతో మీ రుణంలో కొంత భాగాన్ని చెల్లించడానికి ప్రత్నిస్తే ఇంకా మంచిది.