ఈ అలవాట్లకి మీ మెదడుని దూరంగా ఉంచండి

మన శరీరంలో ఉండే అన్ని భాగాల కంటే ఎక్కువ ఎనర్జీని మెదడే తీసుకునేది. మెదడు నుంచి శరీరంలోని వివిధ అవయవాలకు అనేక నాడులు కలుపబడి ఉంటాయి. ఒక పెద్ద టెలిఫోన్‌ వైర్ల నెట్‌వర్క్‌ లాగా మెదడు ఇన్ని కనెక్షన్ ల ద్వారా పనిచేస్తుంది. కాబట్టి, సమయానికి ఆహారం తీసుకుంటూ ఎప్పటికప్పుడు మెదడుకి ఎనర్జీ అందేలా చూసుకోవాలి.

ఈ అలవాట్లకి మీ మెదడుని దూరంగా ఉంచండి

మన శరీరం లోని ఏదైనా ఒక భాగం సమస్యగా ఉన్నప్పుడు మెదడు నిస్సందేహంగా మొత్తం శరీర పనితీరుని మార్చేస్తుంది. మన ధ్యాస అంతా ఆ సమస్య మీదే ఉంటుంది ఆ సమస్య మళ్ళి తగ్గేవరకూ. మెదడు మానవ శరీరం యొక్క అత్యంత ముఖ్యమైన అవయవం. మన శరీరం లోపల జరిగే అన్ని కార్యకలాపాలను మన మెదడు నియంత్రిస్తుంది.

ఒక రోజులో మన మెదడు చాలా పనులను చేస్తుంది. కాబట్టి మనం దాని మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. మన మెదడుకు ఎటువంటి హాని కలుగకుండా మనం చూసుకోవాలి. అప్పుడే మన శరీరంలోని అన్ని అవయవాలు క్రమంగా పని చేస్తాయి తద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అయితే, మెదడుకు కొన్ని హాని కలిగించే అలవాట్ల ఉన్నాయి…అవి ఏంటో ఒకసారి చూద్దామా..

స్మోకింగ్: పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలుగా ప్రమాదమే. స్మోకింగ్ వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. దీనివలన మెదడుకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు ఎదురవుతాయి. అల్జీమర్ వ్యాధి కూడా రావొచ్చు..

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం: రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చెయ్యకపోతే ఆ రోజూ అంతా మీ శరీరానికి అంద వలసిన పోషకాలు సరిగా అందవు. ఈ ప్రభావం మన మెదడు పై చాలా ఉంటుంది…అది మెదడు క్షీణతకు కారణమవుతుంది. మెదడుకు ఒక రోజులో సరైన మోతాదులో పోషకాలు అందకపోతే మెదడు పనిచేసే శక్తి తగ్గుతుంది. మనం తరచు వినే బ్రెయిన్ డ్యామేజ్ సమస్యకు ఇది కూడా ఒక కారణం.

ఎక్కువ చక్కెర వినియోగం: మీకు ఆహారంలో ఎక్కువగా చక్కెర తీసుకునే అలవాటు ఉంటె వెంటనే అది మానుకోండి ఎందుకంటే ఆలా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. దానివల్ల మన మెదడుకు ప్రోటీన్లు మరియు పోషకాలు సరి అయిన మోతాదులో అందవు.

కాలుష్యం: మన శరీరం మొత్తంలో ఎక్కువ ఆక్సిజన్ మెదడుకే అవసరం అవుతుంది. కాలుష్య రహితమైన గాలిని పీల్చడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గి, ఫలితంగా మెదడు యొక్క సామర్థ్యం తగ్గుతుంది.

అనారోగ్యం: అనారోగ్య సమయంలో మెదడుకు ఎక్కువగా విశ్రాంతి అవసరం. అటువంటి సమయములో ఎక్కువగా పనిచేయడం లేదా చదడం వంటివి చేస్తే ఆ ప్రభావం మెదడు మీద పడి మెదడుకు నష్టం కలిగే అవకాశం ఉంది.

అతిగా తినడం: మీకు పొట్ట నిండినా ఇంకా తినడం వలన మీ మెదడుకే సమస్య. ఊబకాయానికి మరియు జ్ఞాపకశక్తి కోల్పోయే వ్యాధికి చాలా దగ్గర సంబంధం ఉందని వైద్యులు చెబుతున్నారు.