NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు..టీడీపీ నేతల హౌస్ అరెస్టు – టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు

తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంకు ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతోంది. 12 డైరెక్టర్ పదవులకు గానూ 45 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ ముఖ్యనేతలను హౌస్ అరెస్టు చేయడం, పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడంపై ఆ పార్టీ నేతలు వైసీపీని విమర్శిస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఆ పార్టీ నాయకులు సంజయ్, రవి నాయుడు, ఆర్సీ మునికృష్ణలతో సహా పలువురు ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు పడుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అర్బన్ బ్యాంకు ఎన్నికల ప్రక్రియపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.

 

రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉందని విమర్శలు గుప్పించారు నారా లోకేష్. తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో జగన్ రెడ్డి దొంగ బ్రతుకు మరో సారి బయటపడిందన్నారు. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేయ్యడానికి వచ్చిన వారిని టీడీపీ నేతలు పట్టుకుంటే వదలివేసి టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకి నిదర్శనమని మండిపడ్డారు లోకేష్. అరెస్టు చేసిన టీడీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా వైసీపీ అదే అరాచకం, అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే దమ్ములేక వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు. టీడీపీ నేతలను గృహ నిర్భందం చేసి ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి ఇక ఎన్నికలెందుకని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. వైసీపీ నేతలు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు వైసీపీ నేతలను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. దొంగ ఐడి కార్డులు ముద్రించి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ అధికార బలంతో ఈ ఎన్నికల్లో గెలిచినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వైసీపీకి ఓటమి తప్పదని అచ్చెన్నాయుడు అన్నారు.

 

కాగా టీడీపీ ఆరోపణలను తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. టీడీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లు వేసే వ్యక్తుల్ని వారే తీసుకువచ్చి ఇక్కడ ఏదో జరుగుతోంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వస్తుంటే కావాలనే డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద దొంగ ఓట్లు అంటూ నాటకాలకు తెరలేపారని భూమన విమర్శించారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N