ఈ నెల 28న తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక

చెన్నై, జనవరి 1: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 28వ తేదీ ఉపఎన్నిక నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఏడాది ఆగస్టు నెలలో కరుణానిధి అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అవసరమయింది.

ఈ నెల 10వ తేదీ నుండి నామినేషన్‌ల స్వీకరణ, 28న పోలింగ్, 31వ తేదీన  ఓట్ల లెక్కింపు జరుగుతాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, వాతావరణ సమస్యలు తదితర కారణాల వల్ల ఇప్పటి వరకూ ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించలేకపోయామని ఈసీ పేర్కొంది.