పవన్ కళ్యాణ్ తాజా చిత్రానికి టైటిల్ ఫిక్స్.. ఈ ఐడియా త్రివిక్రం దే అంటున్నారు ..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా వరుసగా సినిమాలు ప్రకటిస్తూ టన్నుల్లో ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ లు ఇస్తున్నాడు. అసలు ఏ ఒక్కరు పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాలు కమిటవుతాడని భావించలేదు.. ఊహించలేదు. ఇప్పటికే వకీల్ సాబ్ కాకుండా 4 ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ తాజాగా దసరా సందర్భంగా ‘అయ్యప్పన్‌ కొషియమ్‌’ రీమేక్ లో నటిస్తున్నట్టు ప్రకటించారు.

Pawan Kalyan to star in 'Ayyappanum Koshiyum' Telugu remake, Venky Atluri  to direct | The News Minute

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నెం.12గా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారట. కాగా ‘అయ్యప్పన్‌ కొషియమ్’ లో బిజు మేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌ కల్యాణ్‌ పోసిస్తున్నారట. అలాగే మరో కీలక పాత్రలో రానా నటిస్తాడని తెలుస్తోంది. ఈ పాత్రను మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా ఒక టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరూ ఊహించని విధంగా ‘బిల్లా రంగా’ అన్న టైటిల్ పెట్టబోతున్నట్టు ప్రచారం మొదలైంది. బిల్లా పవన్‌ రంగా గా రానా నటిస్తారని అంటున్నారు. ఈ టైటిల్ ని పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు ప్రముఖ దర్శక రచయిత త్రివిక్రం సూచించాడన్న మాట కూడా వినిపిస్తోంది. కాగా 1982లో ‘బిల్లా రంగా’ టైటిల్ తో వచ్చి బ్లాక్ బస్ట్ర అయిన సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు నటించారు.