NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

TN Congress Party : ఆ బీ గ్రేడ్ నటి చేరికతో తమిళ కాంగ్రెస్ కళకళ..!

TN Congress Party : తమిళనాడులో ఎన్నికలు జరగనున్న వేళ శృంగార తారగా గుర్తింపు పొందిన సినీ నటి షకీలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలంగా తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెబుతున్న షకీలా.. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.

తమిళనాడు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆమె పార్టీలో చేరి సభ్యత్వ కార్డు తీసుకున్నారు. ఇక మీదట తమిళనాడు కాంగ్రెస్ హ్యూమన్ రైట్స్ వింగ్ లో షకీలా పనిచేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా షకీలా పాల్గొనబోతున్నట్లు సమాచారం.

TN Congress Party shines with the addition of that B grade actress ..!
TN Congress Party shines with the addition of that B grade actress ..!

TN Congress Party : ప్రజాసేవకు అధికారమే సోపానం!

ప్రజలకు సేవ చేయాలంటే అధికారం ఉండాలి.. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో ఉండడం ద్వారా నా లక్ష్యం నెరవేరుతుంది అని పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ షకీలా స్పష్టం చేశారు. షకీలా చేరిక ఎన్నికల్లో తమకు కలిసివస్తుందని తమిళనాడు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

షేక్ చేసిన షకీలా!

దక్షిణాది సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే వందలాది చిత్రాల్లో నటించిన షకీలా.. శృంగార తారగా ప్రేక్షకుల్లో ఆదరణ పొందారు. మలయాళం, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించారు. 1995లో 18 ఏళ్ల వయస్సులోనే ‘ప్లేగర్ల్స్‌’ చిత్రంలో నటించారు. ఒకప్పుడు మలయాళంలో అగ్ర కథానాయకులకు పోటీగా ఆమె సినిమాలు విడుదలయ్యేవి. దక్షిణాదిలో మరే సినీ తారకు రానంత క్రేజ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా తెలుగులోనూ వరుస అవకాశాలు దక్కించుకున్న షకీలా కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు.

ఇక, గతేడాది ఆమె జీవితకథ ఆధారంగా బయోపిక్‌ కూడా విడుదలైంది. ఆమె పాత్రలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా నటించారు. ఇటీవల, అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ రియాలిటీ షో కుక్ విత్ కోమలిలో షకీలా పాల్గొన్నారు. కోమాలి సీజన్ 2 తో కుక్‌లో కంటెస్టెంట్ గా వచ్చిన షకీలాకు భారీ సంఖ్యలో అభిమానుల మద్ధతు లభించింది. ఎలిమినేషన్ తర్వాత ఆమె ఈ వారం వైల్డ్-కార్డ్ పోటీదారుగా కూడా వస్తున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju