తెలంగాణ అయ్యప్ప భక్తులు పది మంది దుర్మరణం

తమిళనాడు, జనవరి6: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణాకు చెందిన పదిమంది అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మృతి చెందిన భక్తులు తెలంగాణలోని మెదక్ జిల్లా వాసులుగా గుర్తించారు. వారు శబరిమల అయ్యప్పను దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పుదుక్కొట్టాయ్  సమీపంలో అయ్యప్పభక్తులు ప్రయాణిస్తున్న వ్యాన్‌ని కంటైనర్ లారీ ఢీ కొట్టింది.

ఈ వ్యాన్‌లో మొత్తం 16 మంది అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తుండగా వారిలో పది మంది  మృతి చెందారు. మిగిలిన వారు తీవ్రంగా గాయాపడ్డారు. క్షతగాత్రులను తిరుమాయం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, స్థానిక అధికారులు క్షతగాత్రులను పరామర్శించారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.