డబ్బు అనేది మనిషి జీవితం లో ఒక భాగమే కానీ డబ్బే జీవితం కాదు,కాకూడదు…డబ్బు సంపాదనలో పడి బందాలని నిర్లక్షయం చేయకూడదు. పిల్లల పుట్టినరోజులలాంటి విలువయిన రోజులను మరిచిపోవడం, లాంటివి చేయకూడదు. డబ్బు కోసం జీవితం లోని విలువైన క్షణాలు కోల్పోవడం తెలివి తక్కువతనమవుతుంది.
ప్రపంచవ్యాప్తం గా మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే మన దేశం వారు పని చేయడానికేఎక్కువ గంటలు కేటాయించడంలో సిద్ధహస్తులు అనే చెప్పాలి.భవిషత్తు గురించి ఆలోచిస్తూ ప్రస్తుత కాలాన్ని గడ్డుగా గడుపుతుంటారు చాలామంది. ధనవంతులుగా చనిపోవడం అనేది ఒక భావన మాత్రమే. ఉన్నవాడి గా మరణించడం కంటే ,ఉన్నతుడిగా మరణించడం గొప్ప అని గుర్తు పెట్టుకోండి.. ఎన్ని కోట్లు కూడపెట్టినాకూడా సంతోషం అనేది లేనివాళ్లు చాలామంది ఉన్నారు.
నీ సంపాదనలో కొంత దినార్థులకు కేటాయిన్చగలిగితే నువ్వు కోట్లు లేకున్నా సంపన్నుడవే.. కోట్లు కలిగి ఉండి అవసరం లో ఉన్నవాడి కి సాయ పడకపోతే నిరుపేద తో సమానం ఎంత డబ్బున్న కూడా తినేది కడుపుకు సరిపడినంతే, మంచి మంచం కొనగలం కాని నిద్రను కొనలేము. ఎంత డబ్బు ఉన్న ఏ నిమిషం చావువచ్చిన వెళ్లిపోవాలిసిందే… అప్పుడు ఆ డబ్బు నీతో రాదు అని తెలిసి కూడా ఎవ్వరికి ఇవ్వకుండా దాచుకోవడం దేనికో అని ప్రశ్నించుకోవాలి.. దీన్ని బట్టి డబ్బు విలువ ఏమిటో, ఎంతవరకో.. ప్రతిఒక్కరు ఆలోచిన్చాలి..
అర్థం చేసుకోవాలి.నీ సంపాదన ఎంత తక్కువయినా కూడా అంటే 1000 జీతంలో కనీసం 50 రూపాయలు ఇంకొకరికి సహాయపడేలా ప్రణాళిక వేసుకోగలగాలి…మన ఇంటిలో ఒక విలాసవంతమైన అవసరం ఒక్కటి మానుకొని,ఇంకొకరి వైద్య సహాయానికి ఆ డబ్బు ఇవ్వగలగాలి.ఒక్కొక్కసారి మనం ఇచ్చే చిన్నమొత్తమే ఒకరి ప్రాణాన్నో,జీవితాన్నో నిలబెట్టవచ్చు.సహాయం చేయడానికి ఏ చిన్నఅవకాశం వచ్చిన వెనుకడుగు వేయకూడదు.
ప్రతి నెల మీ సంపాదన నుండి పక్కన పెట్టిన డబ్బు ఆ నెలలో ఎవ్వరికి సహాయపడకపోయిన దాన్ని అలానే ఉంచి ఆ తర్వాత నెల డబ్బుకూడా దానికి జమచేసి ఉంచండి..ఖచ్చితం గా అది ఎవ్వరోఒకరికి ప్రాణం పోస్తుంది.నీవు తిన్నది మట్టి పాలు ఇతరులకిచ్చింది నీపాలని తెలుసుకో.. నీవు దాచుకున్నది ఏమైపోతుందో తెలియదు, ఇతరులకు ఇచ్చినది, సహకరించినది మాత్రం నీ ఖాతాలో జమ అవుతున్నది గుర్తు పెట్టుకోవాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?