Today Gold Rate: ఈనెలలో 10సార్లు పెరిగిన బంగారం ధరలు.. ఇదే ట్రెండ్ ఫాలో అవుతుందా..!? 

Share

Today Gold Rate: (17/5/2021) ఏప్రిల్ 1 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి.. అలాగే మే 1 నుంచి 16వ తేదీ వరకు ఒకసారి బంగారం ధరలు పరిశీలించుకుంటే.. ఇప్పటివరకు 10 సార్లు బంగారం ధరలు పెరిగాయి.. 3 సార్లు బంగారం ధరలు తగ్గాయి.. 3 సార్లు స్థిరంగా ఉన్నాయి.. అంటే బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి.. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు పెరిగాయి, అలాగే ఇన్వెస్టర్లు సేఫ్ మోడ్ లో బంగారంపై పెట్టుబడులు ఎక్కువగా పెట్టడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.. ఇదే ట్రెండ్ మరో 3నెలలు కొనసాగుతుందని, పసిడి ధరలు 50 వేలకు చేరుకుంటాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు..!! నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: slightly increases and silver price constant
Today Gold Rate: slightly increases and silver price constant

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.. ఈరోజు పసిడి ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి అతి స్వల్పంగా రూ.10 పెరిగింది.. దీంతో ఈరోజు రేటు రూ.48,990 కి చేరింది.. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటుకి అతి స్వల్పంగా రూ.10 పెరిగి రూ.44,910 కి చేరింది.. ఈరోజు వెండి ధర లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.. నిన్నటి రేటు వద్ద స్థిరంగా ఉంది. ఈరోజు కిలో వెండి ధర రూ. 76,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది..


Share

Related posts

‘ఎన్నికలు వాయిదా వేయాలి’

sarath

నోయల్ ఇంటిలో పార్టీ చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లు..!!

sekhar

Vemulawada: రాజన్న ఆలయంలో కోడే మొక్కును చెల్లించుకున్న ముస్లిం మహిళ..!

Naina