NewsOrbit
న్యూస్

Today Horoscope జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

పుష్యమాసం- ఆదివారం- జనవరి 24.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేషరాశి జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఆటంకాలు వచ్చే అవకాశం !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న పనులను సరైన సమయంలో పూర్తి చేయలేరు. ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కోపానికి చికాకులకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో బంధువులతో మిత్రులతో గొడవ పడే అవకాశం ఉంది. ఈరోజు తొందరగా ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది, మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో స్థాన మార్పులు జరిగే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృషభరాశి జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి !

ఈరోజు మీకు బాగుంటుంది. ఎంతటి కష్టమైన పని అయినా సులువుగా  పని పూర్తి చేస్తారు. స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీ అంతట మీరే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు పొందుతారు. ఖర్చులు తగ్గించుకొని అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు మంచి అవకాశాలను అందుకుంటారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. వ్యాపారస్తులు పెట్టుబడుల పెట్టి లాభాలు పొందుతారు.

రెమిడీః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.పనులు వాయిదా పడే అవకాశం !

ఈరోజు మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. పనులు వాయిదా పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది, లేదంటే నష్టం జరిగే అవకాశం ఉంది.  క్రొత్త పనులు పనులు చేపట్టడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మిత్రుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరగడం వల్ల మానసిక శ్రమ ఏర్పడే అవకాశం ఉంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీసుల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుంటుంది. విద్యార్థులు చదువుమీద శ్రద్ధ చూపడం మంచిది. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు వచ్చే అవకాశం వుంది.

రెమిడీః ఈ రోజు దుర్గా దేవి ఆరాధన చేసుకోండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

కర్కాటక రాశి జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.సమాజంలో గౌరవ ప్రతిష్టలు !

ఈ రోజంతా అనుకూలంగా ఉంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. కష్టంలో ఉన్న వారిని వారిని ఆదుకుంటారు. దయార్ద్ర హృదయం కలిగి ఉంటారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ సొంతంగా పనులను పూర్తి చేసుకుంటారు. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. మీ వాక్చాతుర్యం వల్ల అందరూ మీకు దగ్గరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఎంత కష్టం వచ్చినా ఓర్పుగా, సహనంగా  ముందుకు సాగుతారు, వ్యాపారస్తులు అప్పుల బాధ నుంచి బయటపడి స్వల్ప లాభాలు గడిస్తారు.

రెమిడీః శ్రీభ్రమరాంబికాష్టకం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.అప్పుల బాధలు పెరిగే అవకాశం !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వివాదాలకు, కోపాలకు చికాకులకు దూరంగా ఉండటం మంచిది. అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. విలువైన ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది. స్వల్ప నష్టం. మిత్రులు కూడా శత్రువుల అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది.

రెమిడీః శ్రీ దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఏ పనినైనా ధైర్యంగా సాహసంగా కష్టపడి పూర్తి చేస్తారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్య బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇంతకుముందు చేసిన తప్పులను తిరిగి సరిదిద్దుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీ పరీక్షల విజయం పొందుతారు.

రెమిడీః శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

తులారాశి జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. నష్టం ఏర్పడే అవకాశం. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి కాక వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విభేదాలు అవకాశం ఉంది. మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక నష్టం వల మానసిక ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదువుకోవడం మంచిది.

రెమిడీః ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈ రోజు అద్భుతంగా ఉంటుంది !

ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ తప్పులను మీరు సరిదిద్దుకుంటూ ఎదుటి వారి తప్పులను లోపాలను కూడా సరిదిద్దుతారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి  కష్టపడి బాగా చదువుకుంటారు. ఇంతకుముందు విడిపోయిన దంపతులను తిరిగి కలుసుకుంటారు. అప్పుల బాధలు తీర్చుకొని, అనవసర ఖర్చులకు దూరంగా ఉండి ధన లాభం పొందుతారు. అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. చక్కగా సంతోషంగా ఉంటారు. దైవ భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. ఏ పనైనా చక్కగా నేర్పుగా, ఓర్పుగా చేస్తారు. ఆఫీస్‌లో పై అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి కష్టపడి బాగా చదువుకుంటారు. వ్యాపారంలో ధన లాభం పొందుతారు.

రెమిఢీః శ్రీలక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు అనుకూలంగా లేదు. దేని మీద శ్రద్ధ పెట్టలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎవరికీ డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చేయకుండా ఉండడం మంచిది. సున్నిత మనస్తత్వం వల్ల బాధ పడే అవకాశం ఉంటుంది. మానసిక వేదనకు గురి అయ్యే అవకాశం ఉంది.  అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది. వ్యాపార పెట్టుబడి పెట్టకుండా ఉండడం మంచిది. స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీః ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

మకరరాశి జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. పరువు ప్రతిష్టలకు, క్రమశిక్షణకు పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అనుకున్న పనులన్నీ సరైన సమయంలో పూర్తి చేస్తారు. మీ సొంతంగా మీరే ఆలోచనలు చేసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంగీతం మీద ఆసక్తి చూపిస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహాయం గా ఉంటూ అన్యోన్యంగా ఉంటారు.

రెమిడీః శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. స్నేహితులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు సఖ్యతగా ఉండడం మంచిది. ఏ విషయంలో అయినా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వ్యాపారంలో అత్యాశతో పెట్టుబడి పెట్టడం వల్ల స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. తక్కువగా మాట్లాడడం మంచిది. అతిగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. పెద్దవారిని గౌరవించడం మంచిది. వారి అనవసరపు ఖర్చులు ఎక్కువై ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీః శ్రీలలితా సహస్రనామ పారాయణ చేసుకోండి.

 

మీనరాశి జనవరి -24- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.సంగీతం మీద ఆసక్తి చూపుతారు !

ఈ రోజు బాగుంటుంది. చేపట్టిన ప్రతి పనిని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఆశయ సాధన కోసం కోసం కష్టపడి పనిచేస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు. ప్రకృతిని ఇష్టపడతారు. అందరూ మిమ్మల్ని ఇష్టపడాలి అని తపన పడతారు. సంగీతం మీద ఆసక్తి చూపుతారు. పుస్తకాలు చదవాలని అనుకుంటారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు అన్యోన్యంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. అనవసర ఖర్చు లకు దూరంగా ఉండటం. ధన సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గి అవకాశాలను అందుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.  స్త్రీలు వస్తు లాభం పొందుతారు. వ్యాపారంలో ఆర్ధిక అభివృద్ధి. రుణబాధలు తీరుతాయి.

రెమిడీః శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju