న్యూస్

నీ మనవడిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని సౌందర్యను అడిగిన జ్వాల…!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో జ్వాలనే సౌర్య అనే నిరూపమ్ కు తెలియడంతో సీరియల్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరుగుతుందో ముందుగా తెలుసుకుందాం. జ్వాలను ఇంటికి రమ్మని సౌందర్య, ఆనందరావు అడగడంతో సరే అని ఒప్పుకుని వస్తా అంటుంది జ్వాల.ఇక సౌర్య ఇంటికి రావడంతో హారతి ఇచ్చి బొట్టుపెట్టి లోపలికి తీసుకొస్తుంది సౌందర్య.

హిమ, జ్వాలల ఫోటోను విసిరేసిన జ్వాల :

లోపలికి అడుగుపెట్టిన జ్వాల.. గోడ మీద ఉన్న హిమ, సౌర్యల ఫొటో చూసి కోపంతో రగిలిపోతుంది. ‘మీకు ముందే చెప్పాను నాకు నచ్చినట్లు ఉంటాను అని. ఇలాంటి ఫోటోలు పెట్టి నన్ను బాధపెట్టకండి అంటూ సౌందర్య, ఆనందరావులు అడ్డు పడుతున్నా ఆగకుండా గోడ మీద నుంచి ఆ ఫొటోని తీసేసి గుమ్మం దాకా తీసుకుని వెళ్లి విసిరేస్తుంది. సరిగ్గా అప్పుడే నిరూపమ్ వచ్చి ఆ ఫోటోను పట్టుకుంటాడు. వెంటనే నిరుపమ్ ఆ ఫొటోని సౌందర్య చేతికి ఇచ్చి జ్వాల చేయి పట్టుకుని బయటికి తీసుకుని వెళ్లబోతాడు.డాక్టర్ సాబ్ అని జ్వాల అంటే బావా అని కూడా పిలవచ్చు నాతో రా’ అంటూ లాక్కుని వెళ్తాడు.సీన్ కట్ చేస్తే జ్వాల, నిరూపమ్ రవ్వ ఇడ్లీ దుకాణం దగ్గరకు వెళ్తారు. సౌర్య ఎదురుగా కూర్చున్న నిరుపమ్ ‘జ్వాలా’ అంటాడు. తలెత్తి చూస్తుంది. ‘సారీ సౌర్యా నిన్ను జ్వాల అని పిలిచి పిలిచి అలవాటైపోయింది అంటాడు నిరుపమ్. సారీ జ్వాల. అని నిరూపమ్ కాస్త ఎమోషనల్ గా మాట్లాడుతుంటే.. ‘మీరేం అన్నారు డాక్టర్ సాబ్? ఏం అనలేదు కదా.. మీ మనసులో మాటలు చెప్పారు అంతే కదా’ అంటుంది సౌర్య. సౌర్యా నీకు అందరూ తెలుసు.. నీ వాళ్లు ఎవరో తెలుసు కానీ నువ్వు నువ్వేనని ఎందుకు చెప్పలేదు’ అంటాడు నిరుపమ్. ‘ఎందుకు చెప్పాలి’ అంటుంది సౌర్య. అందరూ ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే కోరుకున్నవాళ్లు ఉండాలిగా అంటుంది సౌర్య. ‘సారీ సౌర్యా అని నేను చాలా రోజుల నుంచి హిమని ప్రేమిస్తున్న అనే విషయం చెప్పాలనుకునే లోపే పైకి లేచిన సౌర్య ‘రేయ్ రవ్వ ఇడ్లీ డాక్టర్ సాబ్‌కి స్పెషల్ చాయ్ పంపించు అని చెప్పి వెళ్లబోతుంది. ఆగు సౌర్యా కనీసం చెప్పే అవకాశం కూడా ఇవ్వవా?’ అంటాడు నిరుపమ్. డాక్టర్ సాబ్..? జరిగింది అంతా నాకు తెలుసు.. జరగబోయేది ఏంటో కూడా నాకు తెలుసు ఇంకేం చెబుతారు? అంటుంది.ఈ ప్రేమ ఉంది చూశారా? ఒక షాప్‌లో వస్తువు దొరక్కపోతే ఇంకో షాప్‌లో కొన్నట్లు అస్సలు దొరకదు డాక్టర్ సాబ్ అనేసి వెళ్ళిపోతుంది.

ప్రేమ్ చూపబోయే పరిష్కారం ఏంటి..?

సీన్ కట్ చేస్తే.. ప్రేమ్‌తో స్వప్న అటు చూస్తే హిమ ఏమో పెళ్లి వద్దు అంతుంది. ఇటేమో నిరుపమ్ పెళ్లి చేసుకుని తీరతాను అని ముహూర్తం కూడా పెట్టేశాడు.నువ్వు మీ డాడీ అస్సలు పట్టనట్లుగా ఉంటారేంట్రా?’ అంటుంది. దాంతో ప్రేమ్ సరే మమ్మీ నాకు కొంచెం టైమ్ ఇవ్వు ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తాను’ అనేసి లోపలికి వెళ్లిపోతాడు.

జ్వాల అందానికి అందరు ఫిదా:

మరోవైపు సౌందర్య సౌర్యని చీరకట్టి, అందంగా రెడీ చేసి బయటికి తీసుకొస్తుంది. అది చూసి ఆనందరావు, హిమలు మురిసిపోతారు. దీప, కార్తీక్‌ల ఫొటో ముందు నిలబడి అందరు దన్నం పెట్టుకుంటారు హిమ, సౌర్యలు. ఇక స్వప్న, శోభ కలిసి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని తలలు పట్టుకుంటారు.ఆంటీ ఆ నాన్నమ్మ మనవరాలు ఇద్దరూ నా చెంప మీద కొట్టారు. పగ తీర్చుకునే తీరతాను.నేనే రంగంలోకి దిగుతాను అని శోభ అంటే ప్రేమ్ ఏదో పరిష్కారం చెబుతాను అన్నాడు కదా అదేంటో చూద్దాం అంటుంది స్వప్న.

కలిసి భోజనం చేద్దాంరా అని హిమను పిలిచిన జ్వాల:

ఇక సీన్ కట్ చేస్తే జ్వాల తినడానికి కూర్చుంటుంది. ఆనందరావు కూడా పక్కనే కూర్చుంటాడు. సౌందర్య ఒడ్డిస్తూ ఉంటుంది.‘నీకు ఇష్టమైనవన్నీ చేశానే బాగా తిను ఎన్ని ఏళ్లు అయిపోయింది మనం ఇలా కలిసి తిని అంటుంది.నీకు ఇంకేం కావాలో అడుగు క్షణాల్లో చేస్తాను అంటుంది సౌందర్య సంబరంగా. ఏం అడిగినా తెచ్చేస్తావా నాన్నమ్మా..నీ డాక్టర్ మనవడు అంటే ఇష్టం.. తెస్తావా నాన్నమ్మా అంటూ కాస్త ఎమోషనల్‌గా అంటుంది సౌర్య. సౌందర్య షాక్ అయిపోయి అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా.. కడుపు నిండా భోజనం చేద్దామమ్మా అంటాడు ఆనందరావు. ఇంతలో హిమ వస్తుంది. ఏంటే ఇంత లేట్? తొందరగా రావచ్చు కదా? అంటుంది హిమని చూడగానే సౌందర్య. నేను కూర్చుంటే సౌర్య లేచి వెళ్లిపోతుందేమో అని మనసులో అనుకుంటూ వద్దులే నాన్నమ్మా మీరు కానివ్వండి నేను మళ్లీ తింటాను అని చెప్పి వెళ్లిపోబోతుంది. నాన్నమ్మా రమ్మని చెప్పు కూర్చుని తినమను అంటుంది సౌర్య సౌందర్యతో హిమ షాక్ అవడంతో ఈరోజు సీరియల్ ముగుస్తుంది.


Share

Related posts

బ్రేకింగ్: భద్రత కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన రఘురామ కృష్ణంరాజు

Vihari

ఫేక్ వార్త‌ల‌కు చెక్ పెట్టనున్న ఫేస్‌బుక్‌.. కోవిడ్ కోసం ప్ర‌త్యేకంగా సెక్ష‌న్‌..

Srikanth A

KTR : కేటీఆర్ కు షాకిచ్చిన కేసీఆర్ ? సీఎం కాకముందే….

sridhar